వింత ఘటన: భర్త చెల్లినే పెళ్లి చేసుకున్న భార్య! అ‍త్తింటి వారిపై కేసు

Mother Of Two Children Marries Husband Sister At Bihar Goes Viral - Sakshi

ఒక మహిళకు వివాహమై పదేళ్లు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. ఆమె తన భర్త, పిల్లలతో  హాయిగా జీవిస్తోంది కూడా. ఏమైందో ఏమో ఉన్నట్టుండి భర్త చెల్లినే పెళ్లి చేసుకుంది. పైగా ఆమహిళ తన మరదలితో భార్యభర్తల్లా కలిసి జీవిస్తున్నారు. దీనికి ఆమె భర్త సైతం అడ్డు చెప్పలేదు. ఇదంతా నచ్చని ఆ మహిళ అత్తమామలు ఆమె మరదలిని (భాగస్వామిని) తీసుకు వెళ్లిపోయారు. దీంతో సదరు మహిళ వారిపై కిడ్నాప్‌ కేసు పెట్టింది. ఈ విచిత్ర ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే..బిహార్‌లో నివశిస్తున్న ప్రమోద్‌ దాస్‌, శుక్లా దేవి జంటకు వివాహమై పదేళ్లు అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా. ఐతే ఏమైందో ఏమో ఆమె ఒక రోజు భర్త చెల్లెలు 18 ఏళ్ల సోని దేవిని పెళ్లి చేసుకుంది. పైగా వారిద్దరూ భార్యభర్తల్లా జీవించడం ప్రారంభించారు. అందుకు భర్త వ్యతిరేకించకపోగా, తన భార్య సంతోషమే తన సంతోషం అని శుక్లా దేవి భర్త దాస్‌ చెబుతుండటం విశేషం. ఇక్కడే అసలు ట్విస్ట్‌ మొదలైంది.

ఇక్కడ వరకు కథ అంతా బాగానే సాగింది. ఎప్పుడైతే దాస్‌ భార్య అతడి చెల్లిని పెళ్లి చేసుకుందో అ‍ప్పటి నుంచి దాస్‌తో జరిగిన పెళ్లిని వ్యతిరేకిస్తోంది. అంతేగాదు అతడి భార్య తన పెళ్లి చేసుకున్న భర్త చెల్లెలుతో జీవించేందుకు మగవాడిగా మారాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగా వేషధారణ మార్చంది కూడా. అక్కడితో ఆగక పోగా మగవాడిలా మారేందుకు సర్జరీ చేసుకోవాలని ప్లాన్‌ చేయడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుబ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

అంతేగాదు ఆ మహిళ అత్తమామలు సోని దేవిని ఆమె నుంచి బలవంతంగా తీసుకువెళ్లిపోయారు. దీంతో శుక్లాదేవి పోలీసులను ఆశ్రయించింది. పైగా అత్తింటి వారిపై కిడ్నాప్‌ కేసు కూడా పెట్టింది. పైగా ప్రేమ ఎప్పుడూ ఎలా పుడుతుందో తెలియదు, ఇది మనసుకు సంబంధించింది అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతోంది సదరు మహిళ శుక్లా దేవి. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ ఇది కాస్త వివాదాస్పదమైన కేసు అని వాస్తవాలను వెలకితీసేలా సున్నితంగా దర్యాప్తు చేయాల్సి అంశం అని చెప్పారు. 

(చదవండి:  మోదీపై తృణమూల్‌ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు, జైశంకర్‌పై కూడా..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top