20వ తేదీ నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు! | Monsoon session of Parliament likely from July 20 | Sakshi
Sakshi News home page

20వ తేదీ నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు!

Jul 1 2026 5:27 AM | Updated on Jul 1 2026 5:27 AM

Monsoon session of Parliament likely from July 20

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జూలై 20వ తేదీ నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి. మూడు వారాలపాటు ఉభయసభల సమావేశాలు జరుగుతాయని అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ త్వరలో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. సాధారణంగా వర్షాకాల, శీతాకాల సమావేశాలు 20 రోజులపాటు మొత్తంగా నాలుగు వారాలకుపైగా జరుగుతాయి. కానీ ఈసారి సమావేశాలను మూడు వారాలకు కుదించినట్లు పార్లమెంట్‌ వర్గాలు వెల్లడించాయి.

పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చెరిలో బీజేపీ ఘనవిజయం తర్వాత జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాలు జరగడం ఇదే తొలిసారి. ఈసారి ఉభయసభల్లో టీఎంసీ, శివసేన(యూబీటీ) తిరుగుబాటు ఎమ్మెల్యేల అంశం కీలకంగా మారనుంది. తమను ప్రత్యేకమైన శిబిరాలుగా గుర్తించాలని 20 మంది టీఎంసీ, ఆరుగురు శివసేన(యూబీటీ) ఎంపీలు ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కోరిన విషయం తెల్సిందే. లోక్‌సభలో ఎంపీ స్థానాలను పెంచుతూ, మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని 2029 నుంచి అమలుచేసేందుకు ఉద్దేశించేందుకు బిల్లు ఇటీవల వీగిపోవడంతో గత పార్లమెంట్‌ సెషన్‌ ముగియడం తెల్సిదే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement