కర్ణాటకలో మంకీ ఫీవర్‌.. తొలి కేసుగా నమోదు

Monkey Fever Claims First Victim In Karnataka - Sakshi

సాక్షి, యశవంతపుర: కర్ణాటకలో చిక్కమగళూరు జిల్లా ఎన్‌ఆర్‌ పుర తాలూకా సీతూరు జీపీ పరిధిలోని బెమ్మనెలలో ఒకరికి మంకీ ఫీవర్‌ (కోతి జ్వరం– కేఎఫ్‌డీ) సోకింది. ఇది మొదటి కేసుగా గుర్తించారు. బాధితునికి కరోనా పాజిటివ్‌ రావటంతో మరిన్ని పరీక్షలు చేయగా మంకీ ఫీవర్‌గా గుర్తించారు. తీర్థహళ్లి తాలూకా అరగలో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లి వచ్చిన్నట్లు గుర్తించారు. రోగిని ఉడుపి వద్దనున్న మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి తదితరాలు ఈ జబ్బు లక్షణాలు. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదముంది. కోతుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top