తెలుగు రాష్ట్రాల పోలీసులకు పతకాలు | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల పోలీసులకు పతకాలు

Published Wed, Nov 1 2023 4:29 AM

Medals Awarded by Central Government - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దుల రక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి నాలుగు ఆపరేషన్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్‌ అధికారులు, సిబ్బందికి కేంద్ర హోంశాఖ మెడల్స్‌ను ప్రకటించింది. 2023 సంవత్సరానికి తెలంగాణ నుంచి 22 మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 12 మందిని ఎంపిక చేసినట్లు హోంశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

హోంశాఖ 2018లో ఆపరేషన్స్‌ మెడల్స్‌ను ప్రవేశపెట్టింది. తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు, ఒక నాన్‌కేడర్‌ ఎస్పీ, ఒక డీఎస్పీ, ఒక ఇన్‌స్పెక్టర్, ముగ్గురు ఎస్‌ఐలు, ఐదుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, తొమ్మిదిమంది కానిస్టేబుళ్లు మొత్తం 22 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏపీ నుంచి ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు, ఒక నాన్‌కేడర్‌ ఎస్పీ, ఒక ఇన్‌స్పెక్టర్, ఒక ఎస్‌ఐ, ఒక ఆర్‌ఎస్‌ఐ, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు మొత్తం 12 మందిని ఎంపిక చేసింది. 

తెలంగాణ నుంచి ఎంపికైన వారు 
రాజేష్ కుమార్‌ (ఐజీపీ), నరేందర్‌ నారాయణరావు చుంగి (ఎస్పీ), ఎస్‌.చైతన్య కుమార్‌ (నాన్‌కేడర్‌ ఎస్పీ), డీఎస్పీ ఆర్‌.శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజశేఖర్, ఎస్‌ఐలు పి.విజయభాస్కర్, ఏ.వరుణకాంత్‌ రెడ్డి, మహమూద్‌ యూసఫ్, హెడ్‌ కానిస్టేబుళ్లు టి.హరినాథ్, షేక్‌ అజారుద్దీన్, ఎం.జీ.శివమణి, ఎస్‌.ప్రసాద్, కే.సి.విజయ్‌కుమార్, పీసీలు మహమూద్‌ ఖాజా మొయిద్దీన్, మోహముంద్‌ ఇంతియాజ్, బి.సుమన్, పి.రవీందర్, ఎం.రవీదర్‌కుమార్, ఎస్‌.ప్రేమ్‌కుమార్, ఎండీ షబ్బీర్‌ పాషా, ఇంతియాజ్‌ పాషా షేక్, ఏ.శ్రీనివాస్‌. 

ఏపీ నుంచి ఎంపికైన వారు 
వినీత్‌ బ్రిజ్‌ లాల్‌ (ఐజీపీ), బాబూజీ అట్టాడ (ఎస్పీ), ఈజీ అశోక్‌కుమార్‌ (ఎస్పీ, నాన్‌కేడర్‌), షేక్‌ సర్దార్‌ ఘని (ఇన్‌స్పెక్టర్‌), సవ్వన అనిల్‌కుమార్‌(ఎస్‌ఐ), ఎంవీఆర్‌పీ నాయుడు (ఆర్‌ఎస్‌ఐ), రాజన్న గౌరీ శంకర్‌ (హెడ్‌కానిస్టేబుల్‌), అనంతకుమార్‌ నంద (హెడ్‌కానిస్టేబుల్‌), పీసీలు అడప మణిబాబు, వి.శ్రీను, జి.భాస్కరరావు.

 
Advertisement
 
Advertisement