మావోయిస్టుల ఘాతుకం.. బీజేపీ నేత దారుణ హత్య

Maoists Killed BJP Leader In Chhattisgarh Charla - Sakshi

చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళుతున్న బీజేపీ నేతను బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలోనే దారుణంగా నరికి చంపారు. దీంతో ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. 

బీజాపూర్‌ జిల్లా ఆవుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల పెకారం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. బీజాపూర్‌ జిల్లా ఊసూరు బ్లాక్‌ బీజేపీ అధ్యక్షుడు కెక్కెం నీలకంఠ (45) స్వగ్రామం పెకారం గ్రామం కాగా, కొంతకాలంగా ఊసూరులోనే ఉంటున్నాడు. ఆదివారం పెకారంలో వివాహ వేడుకకు హాజరయ్యాడు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన మావోయిస్టులు నీలకంఠను కత్తులతో పొడవడంతో పాటు గొడ్డళ్లతో దారుణంగా నరికారు. ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నందునే హతమార్చామని మృతదేహం వద్ద లేఖ వదలివెళ్లారు. దీంతో, ఈ ఘటన సంచలనంగా మారింది.  
 

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top