నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారం.. పోలీసుల ఎన్‌కౌంటర్‌ | man wanted in rape murder case of his 4year old niece | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారం.. పోలీసుల ఎన్‌కౌంటర్‌

Apr 20 2026 1:22 PM | Updated on Apr 20 2026 1:40 PM

 man wanted in rape murder case of his 4year old niece

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నరరూప రాక్షసున్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ఘాజియాబాద్‌ జిల్లాకు చెందిన జీషన్‌ అనే వ్యక్తి తన నాలుగేళ్ల కోడలును అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి అనంతరం గొంతునులిమి చంపాడు. అనంతరం పారిపోగా తాజాగా పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఆ కిరాతకుడు మరణించాడు.

పోలీసుల వివరాల ప్రకారం

ఏప్రిల్‌ 11 మధ్యాహ్నం 12 గంటల సమయంలో అపంశుభం తెలియని నాలుగేళ్ల పాప ఇంటి బయిట ఆడుకుంటుంది. అది గమనించిన జీషన్ అనే వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి తనకు తినుబండారాలు కొనిస్తానని ఆశచూపి తనతో తీసుకెళ్లాడు. అనంతరం ఆ పసికందును ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం గొంతు నులిమి చంపాడు. ఏవరికి అనుమానం రాకుండా ఆ పసిపాప మృతదేహాన్ని కారుకింద పడేశాడు. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు ‍అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడిపై రూ. 50 వేల రివార్డు ప్రకటించారు.

అయితే కొద్దిరోజుల క్రితం ఢిల్లీ రైల్వే స్టేషన్ పరిసరాల్లో అతని జాడలు కనుక్కొన్నారు.  అతని జాడకోసం విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో అతను లోని ప్రాంతంలోని బాంతాల కెనాల్ వద్ద ఒకరిని కలవాల్సి ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతనిని పట్టుకోవడం కోసం పక్కా ప్రణాళిక వేశారు. నిందితున్ని పట్టుకునే క్రమంలో అతడు పోలీసులపై కాల్పులు జరపగా ఆత్మరక్షణ కోసం తిరిగి కాల్పులు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదంలో భద్రతా సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement