Madhya Pradesh: ఆసక్తికర పరిణామం.. సీఎంను కలిసిన పీసీసీ చీఫ్‌ | Madhya Pradesh Kamal Nath meets CM Shivraj Singh Chouhan | Sakshi
Sakshi News home page

Madhya Pradesh: ఆసక్తికర పరిణామం.. సీఎంను కలిసిన పీసీసీ చీఫ్‌

Dec 4 2023 3:40 PM | Updated on Dec 4 2023 3:59 PM

Madhya Pradesh Kamal Nath meets CM Shivraj Singh Chouhan - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను మాజీ సీఎం, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్‌ కలిశారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నివాసానికి సోమవారం వచ్చిన కమల్‌నాథ్‌ ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. కమల్‌నాథ్‌ను సాదరంగా ఆహ్వానిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లారు.

మధ్యప్రదేశ్‌ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో బీజేపీ తిరుగులేని విజయాన్ని సొంత చేసుకుంది. 230 స్థానాలకు గానూ ఏకంగా 163 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టుకుంది. కాగా కమల్‌నాథ్‌ సారధ్యంలో బరిలోకి దిగిన కాంగ్రెస్‌ పార్టీ 66 స్థానాలకే పరిమితమైంది.

Advertisement
 
Advertisement
Advertisement