కేరళలో 16 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ

Lok Sabha polls 2024: Congress to contest 16 seats in Kerala - Sakshi

తిరువనంతపురం: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో విపక్షాల యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(యూడీఎఫ్‌) కూటమి తరఫున అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ బరిలో దిగనుంది. కేరళలో 20 లోక్‌సభ స్థానాలు ఉండగా మా పార్టీ 16 చోట్ల పోటీ సిద్ధమవుతోందని కాంగ్రెస్‌ పార్టీ బుధవారం ప్రకటించింది. యూడీఎఫ్‌ కూటమి పారీ్టల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచి్చంది. సీట్లపంపకాల వివరాలను కాంగ్రెస్‌ కేరళ చీఫ్‌ కె.సుధాకరన్, యూడీఎఫ్‌ చైర్మన్‌ వీడీ సతీశన్‌ మీడియాకు వెల్లడించారు.

కాంగ్రెస్‌ పార్టీ 16 చోట్ల, యూడీఎఫ్‌ కూటమి పార్టీ అయిన యునియన్‌ ముస్లిం లీగ్‌(ఐయూఎంఎల్‌) రెండు చోట్ల, కేరళ కాంగ్రెస్‌(జాకబ్‌) పార్టీ, రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ చెరో ఒక స్థానంలో పోటీకి నిలుస్తాయని కేరళ అసెంబ్లీలో విపక్ష నేత సతీషన్‌ చెప్పారు. కూటమి తరఫున ఎక్కువ స్థానాల్లో పోటీచేస్తున్నందుకు బదులుగా కేరళలో వచ్చే దఫాలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానం నుంచి ఐయూఎంఎల్‌కు కాంగ్రెస్‌ మద్దతు పలకనుంది. రాష్ట్రంలోని అన్ని సీట్లను గెలవడమే లక్ష్యంగా విపక్షాల ‘ఇండియా’ కూటమికి మద్దతివ్వాలని యూడీఎఫ్‌ నిర్ణయించుకుంది.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top