అల్ప ఆదాయ వర్గాల కోసం ఎల్‌ఐసీ అదిరిపోయే పాలసీ! | LIC Micro Bachat Plan, Full Details Here | Sakshi
Sakshi News home page

అల్ప ఆదాయ వర్గాల కోసం ఎల్‌ఐసీ అదిరిపోయే పాలసీ!

Mar 28 2021 5:25 PM | Updated on Mar 28 2021 5:28 PM

LIC Micro Bachat Plan, Full Details Here - Sakshi

దినసరి ఆదాయం తక్కువగా ఉన్న కార్మికుల కోసం ఎల్‌ఐసీ ప్రత్యేకంగా ఒక పాలసీని తీసుకొచ్చింది. తక్కువ ఆదాయం గల వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీ తీసుకోని వచ్చింది. ఈ పాలసీ పేరే ఎల్‌ఐసీ మైక్రో బచత్ పాలసీ. ఇందులో పెట్టుబడి పెట్టడానికి భారీ మొత్తం అవసరం లేదు. చాలా తక్కువ డబ్బుతో ఇందులో చేరవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఇది. ఎల్‌ఐసీ అంటే ఇప్పటికీ ప్రజల్లో నమ్మకం ఉంది. 

ఇది నాన్ లింక్డ్ మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల రెండు బెనిఫిట్స్ పొందొచ్చు. రక్షణతోపాటు రాబడి కూడా లభిస్తుంది. ఆకారణం చేత పాలసీదారుడు మరణిస్తే నామినీకి డబ్బులు వస్తాయి. ఒకవేళ పాలసీదారుడు జీవించి ఉంటే పాలసీ డబ్బులు వస్తాయి. ఇంకా ఈ పాలసీపై లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ పాలసీ ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. 18 ఏళ్లు నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.50 వేలకు పాలసీ తీసుకోవాలి. గరిష్టంగా రూ.2 లక్షల మొత్తానికి పాలసీ పొందొచ్చు. పాలసీ టర్మ్ 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లు ఉంటుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయసు కలిగిన వారు రూ.2 లక్షల మొత్తానికి ఈ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. పాలసీ టర్మ్ 15 ఏళ్లు. ఇప్పుడు సంవత్సరానికి రూ.10,320 ప్రీమియం చెల్లించాలి. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.2 లక్షలకు పైగా లభిస్తాయి.

చదవండి:

పిల్లల కోసం ఎల్ఐసీ ప్రత్యేక పాలసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement