
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై వ్యంగ్య కామెడీతో వివాదానికి కేంద్ర బిందువుగా మారిన స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా తాజాగా మరో వివాదానికి తెర తీశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను, ఆమె ఆర్థిక విధానాలను విమర్శిస్తూ సూపర్ హిట్ హిందీ సినిమా ‘మిస్టర్ ఇండియా’లోని ఐకానిక్ పాట ‘హవా హవాయీ’ని పేరడీ చేశారు. ‘ఆప్ కా ట్యాక్స్ కా పైసా హో రహా హవా హవాయీ (జనాలు కట్టే పన్నుల డబ్బులు గోల్‌మాల్ అవుతున్నాయి)’అంటూ బుధవారం విడుదల చేసిన వీడియోలో చెణుకులు విసిరారు.
తాజాగా కునాల్ కమ్రాన్.. ‘ట్రాఫిక్ బఢానే ఏ హై ఆయీ, బ్రిడ్జెస్ గిరానే ఏ హై ఆయీ, కెహతే ఇస్ కో తానాషాహీ (అది ఉన్నదే ట్రాఫిక్ కష్టాలు పెంచేందుకు, బ్రిడ్జిలను కూలగొట్టేందుకు. నియంతృత్వం అంటారు దాన్ని)’ అంటూ అధికార బీజేపీ తీరుపైనా వ్యంగ్యా్రస్తాలు సంధించారు. అయితే తమ పాటను అనుమతి లేకుండా వాడుకోవడం ద్వారా కామ్రా కాపీరైట్‌ను ఉల్లంఘించారని టీ సిరీస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే తాజా పేరడీని యూట్యూబ్‌లో బ్లాక్ చేయించింది. దీన్ని కామ్రా తీవ్రంగా తప్పుబట్టారు.
మరోవైపు షిండే ఉదంతంలో విచారణకు హాజరయ్యేందుకు వారం గడువు కావాలన్న కామ్రా విజ్ఞప్తిని ముంబై పోలీసులు తిరస్కరించారు. తక్షణం విచారణకు రావాలంటూ రెండోసారి సమన్లు జారీ చేశారు. బుధవారం ఆయనపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను టార్గెట్ చేసిన కునాల్ కమ్రా.. క్లబ్‌లో ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. షిండేను దోశద్రోహి అంటూ విమర్శిస్తూ పేరడి పాట పాడారు. దీంతో, శివసేన కార్యకర్తలు ఆగ్రహంతో క్లబ్‌పై దాడిపై చేశారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
The video has been blocked from YouTube by T-Series due to copyright.
So before deleting the video from X, watch it yourself and share it with others to see it.#kunalkamra pic.twitter.com/pCZ67v6zmX— Dhruv Rathee (Parody) (@DhruvRatheeIN) March 26, 2025