Krishna Janmabhoomi Case Transferred To Allahabad High Court - Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణ జన్మభూమి కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ

May 26 2023 7:58 PM | Updated on May 26 2023 8:29 PM

Krishna Janmabhoomi Case Transferred To Allahabad High Court - Sakshi

ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించిన అన్ని కేసులు అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. ప్రస్తుతం ఈ పిటిషన్లు మథుర జిల్లా కోర్టు విచారణలో ఉన్నాయి. అయితే కృష్ణ జన్మభూమి కేసు జాతీయ ప్రాధాన్యత కలిగినదని, దీనిని హైకోర్టు విచారణ చేపట్టాలని హిందూ పిటిషనర్లు కోరారు.  మే 3న విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తాజాగా శ్రీ కృష్ణ జన్మభూమి కేసులపై తామే విచారణ చేపడతామని హైకోర్టు శుక్రవారం ప్రకటించింది. ఆ మేరకు సంబంధిత కేసులను హైకోర్టు తనకు బదిలీ చేసుకుంది.

కాగా శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం పక్కన ఉన్న షాహి ఈద్గా మసీదు నిర్మితమైందంటూ భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్‌మాన్, రంజనా అగ్నిహోత్రితోపాటు మరో ఏడుగురు  సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  షాహీ మసీదు ఈద్గా నిర్వహణ కమిటీ, శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్,  శ్రీ కృష్ణ జన్మ స్థాన్ సేవా సంస్థాన్‌లను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. మసీదు స్థలంపై హిందువులకే హక్కులు ఉంటాయని వాదించారు. హిందూ దేవాలయాలను కూలగొట్టి ఈద్గాను నిర్మించారని తెలిపారు. అలాంటి నిర్మాణం మసీదు కాబోదని పేర్కొన్నారు. ఆ భూమిని మసీదు నిర్మాణం కోసం ఎవరూ ఇవ్వలేదని తెలిపారు.
చదవండి: సివిల్స్‌ ఫలితాల‍్లో ఇద్దరు అమ్మాయిలకు ఓకే ర్యాంకు.. అదెలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement