
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు అయింది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సమావేశాల్లో నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం ఉంటాయి. అదే విధంగా రాజ్యసభ సమావేశాలు జూన్ 27 నుంచి జూలై 3 వరకు జరుగుతాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్‌సభ, రాజ్యసభలను ఉద్దేశించి జూన్ 27న ప్రసంగించనున్నారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో చేసే పాలన గురించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ఎన్నికైన కేంద్ర మంత్రులను పార్లమెంట్‌కు పరిచయం చేయనున్నారు.