
ఢిల్లీ : దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీలు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఎంపీలు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినా తాను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
కేవలం ఉపరాష్ట్రపతి కోసం జరిగే ఎన్నికగా చూడొద్దని, ఇది భారత ఆత్మ కోసం జరిగే ఎన్నికగా ఎంపీలు భావించాలన్నారు. అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.