ప్రయాణికుడు చేసిన తప్పిదం..విమానం టేకాఫ్‌కు ముందే..

గత కొద్దిరోజులుగా విమానంలో ప్రయాణికుల వరుస అనుచిత ప్రవర్తనల ఘటనలు గురించి వింటునే ఉన్నాం. అదే తరహాలో ఒక ప్రయాణికుడు ఒక పొరపాటు చేశాడు. ఏకంగా విమానం బయలుదేరే సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట డోర్‌ని ఓపెన్ చేశాడు. ఐతే ఆ తప్పిదాన్ని ఎయిర్‌లైన్స్ సకాలంలో గుర్తించింది కాబట్టి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్త లేదు. ఈ ఘటన గతేడాది డిసెంబర్ 10న ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంది.
ఈ సంఘటన గురించి డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజీసీఏ) అధికారికంగా వెల్లడించింది. అంతేగాదు ఈ ఘటనపై సత్వరమే విచారణకు ఆదేశించడంతో ఫ్లైట్ రెగ్యులేటర్ స్పష్టమైన నివేదిక ఇచ్చినట్లు కూడా పేర్కొంది.ఆ విమానం చెన్నై నుంచి త్రివేండ్రమ్ వెళ్లున్నప్పుడూ ఈ ఘటన జరిగినట్లు డీజీసీఏ పేర్కొంది. ప్రయాణికులను దించేసిన అనంతరం ఆ విమానం తిరుచిరాపల్లికి బయలుదేరినట్లు కూడ తెలిపింది.
అయితే ఈ ఘటన గురించి సదరు ఎయిర్ లైన్స్ డీజీసీఏకి వివరణ ఇస్తూ.. "ఆ రోజు ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు పొరపాటున ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోరును తెరిచాడు.ఐతే తాము విమానం టేకాఫ్‌కు ముందే ఆ విషయాన్ని గమనించాం. తాము వెంటనే డోర్‌ని మళ్లీ ఇన్‌స్టాల్ చేసి, విమానంలో గాలి ఒత్తిడి ఎంత మేర ఉందో తనఖీ చేశాం. అంతేగాదు సేఫ్టీ ప్రోటోకాల్స్ విషయంలో రాజీపడకుండా తనిఖీలు నిర్వహించాం. అందువల్లే ఎలాంటి అవాంఛీనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు." అని ఎయిర్‌లైన్స్ స్పష్టంగా వివరణ ఇచ్చిందని డీజీసీఏ అధికారులు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు