
న్యూఢిల్లీ: భారత్‌లో ఆదివారం 45,083 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 3,68,558కు పెరిగింది. యాక్టివ్ కేసులు పెరగడం ఇది వరుసగా అయిదో రోజు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.13 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో 460 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,37,830కు చేరుకుంది. శనివారం 17,55,327 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. టెస్టు పాజిటివిటీ రేటు 2.28గా నమోదైంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 63.09 కోట్ల డోసుల టీకాలు వేశారు. ఇటీవల వరుసగా నాలుగు రోజుల పాటు కేరళలో 30 వేలకు పైగా కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో 29,836 కరోనా కేసులు బయటపడ్డాయి.