కరోనా కిల్లర్‌: ఆఫ్టర్‌ 28 డేస్‌...

Immune System Develops Within 28 Days After Taking Pfizer Caccine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా కిల్లర్‌గా భావిస్తున్న ఫైజర్‌ టీకా మంగళవారం నుంచి బ్రిటన్‌లో ఇవ్వడం ప్రారంభించనున్నారు. ఇటు భారత్‌లోనూ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ కంపెనీ దరఖాస్తు చేసుకుంది.. ఈ నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం కనుక అనుమతిస్తే.. అది ఎలా పనిచేస్తుంది అన్నది మనకు తెలియాలిగా.. ఈ టీకాను అక్స్‌ఫర్డ్, మోడెర్నా లాంటి వాటిలా కాకుండా –70డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది.. రెండు డోసులు తీసుకోవాలి. ఒక్కో డోసు ధర రూ.1,500.. అయితే.. 28 రోజులు చాలట.. వైరస్‌కు వ్యతిరేకంగా మన శరీరంలో పూర్తి స్థాయిలో రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దామా.. చదవండి: కరోనా వ్యాక్సిన్‌కు తొలి దరఖాస్తు

మొదటి రోజు.. తొలి డోస్‌.. 
► 12వ రోజు.. రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది.. 
► 21వ రోజు.. రెండో డోస్‌ 
► 28వ రోజు.. పూర్తి స్థాయిలో రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top