వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ తర్వాత ఏమి చేయాలి?

I Have Registered on Cowin, Now What - Sakshi

న్యూఢిల్లీ: 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్-19 టీకా తీసుకోవడం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం నిన్న ప్రారంభించింది. రిజిస్టర్డ్ చేసుకున్న లబ్ధిదారులకు టీకాలు వేయడం మే 1 నుంచి ప్రారంభంకానుంది. ఇంకా కోవిడ్ టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోక పోతే కోవిన్ ఆన్లైన్ పోర్టల్(cowin.gov.in), ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ యాప్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోవచ్చు. కోవిడ్-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించిన రోజున 1.32 కోట్లకు పైగా ప్రజలు తమ పేరును నమోదు చేసుకున్నారు.

రిజిస్ట్రేషన్ తర్వాత ఏమి చేయాలి?

  • కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత లబ్ధిదారుడు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నిర్ణీత తేదీ, ప్రదేశం, టీకా వేసుకునే సమయం గురించి 
  • మీ మొబైల్ కు ఎస్ఎంఎస్ వస్తుంది.
  • ఎస్ఎంఎస్ లో తెలిపిన తేదీ నాడు టీకా కేంద్రాల దగ్గరకు వెళ్లేటప్పుడు మీరు ఫోటో ఐడీని, పోర్టల్ లేదా యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న రశీదును మీ వెంట తీసుకొని వెళ్లాలి.
  • కోవిడ్ -19 వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత, లబ్ధిదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. 
  • వ్యాక్సిన్ అన్ని డోస్ లు తీసుకున్న తర్వాత, లబ్ధిదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు క్యూఆర్ కోడ్ ఆధారిత సర్టిఫికేట్ వస్తుంది. 
  • ఈ సర్టిఫికెట్‌ను డిజి-లాకర్‌లో భద్రపరుచుకోవచ్చు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించి నలుగురు వ్యక్తులు కోవిడ్ -19 టీకా కోసం నమోదు చేసుకోవచ్చు. మీరు ఉమ్మడి టీకా కోసం నమోదు చేసుకుంటే, వేర్వేరు వయసుల క్రిందకు వచ్చే టీకాలు పొందాలనుకునే వారు, అంటే 45 కంటే ఎక్కువ లేదా అంతకంటే తక్కువ(18-44 వయస్సు) గల వారు, మీరు మీ టీకా కేంద్రాన్ని జాగ్రత్తగా ఎన్నుకోవాలి. కేంద్ర ప్రభుత్వం టీకా కేంద్రాల వద్ద 45 ఏళ్లు పైబడిన లబ్ధిదారులకు మాత్రమే టీకాలు వేస్తుంది. మిగతా వారికీ మే 1 నుంచి అనేక రాష్ట్రాలు టీకా కేంద్రాలలో ఉచిత టీకాలు వేస్తున్నట్లు ప్రకటించాయి. మీ రాస్ట్రంలో అలాంటి ప్రభుత్వ టీకా కేంద్రం లేకపోతే, మీరు ప్రైవేట్ ఆసుపత్రులలో డబ్బులు చెల్లించి టీకాల కోసం వేసుకోవాల్సి ఉంటుంది.

చదవండి: 

భారీగా బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top