షిర్డీ సాయికి రూ. 33 లక్షలతో బంగారు కిరీటం | Hyderabad doctor donates gold crown worth Rs 33 lakh to Shirdi Saibaba temple | Sakshi
Sakshi News home page

షిర్డీ సాయికి రూ. 33 లక్షలతో బంగారు కిరీటం

Jul 23 2022 4:09 AM | Updated on Jul 23 2022 12:38 PM

Hyderabad doctor donates gold crown worth Rs 33 lakh to Shirdi Saibaba temple - Sakshi

షిర్డీ: హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మందా రామకృష్ణ(80) షిర్డీ సాయిబాబాకు రూ.33 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని శుక్రవారం అందజేశారు. ఈ విషయాన్ని శ్రీసాయిబాబా సంస్థాన్‌ ట్రస్టు సీఈఓ భాగ్యశ్రీ బనాయత్‌ వెల్లడించారు. ఈ కిరీటం బరువు 707 గ్రాములు. 35 గ్రాముల అమెరికా వజ్రాలను కిరీటంలో పొదిగారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మందా రామకృష్ణ మాట్లాడుతూ.. తాను భార్యతో కలిసి 1992లో షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నానని చెప్పారు.

ఆ సమయంలో సాయిబాబా ఆలయ పూజారి ఒక కిరీటాన్ని తమకు చూపించారని అన్నారు. అలాంటి కిరీటాన్నే సాయిబాబాకు అందజేస్తానని తన భార్యకు మాట ఇచ్చానన్నారు. అప్పట్లో తన వద్ద తగినంత డబ్బు లేదని తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత అమెరికాలో 15 ఏళ్లపాటు వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేశానని, అలా వచ్చిన డబ్బుతో కిరీటం తయారు చేయించి, సాయిబాబా పాదాల వద్ద పెట్టానని వివరించారు. డాక్టర్‌ రామకృష్ణ భార్య కొన్ని సంవత్సరాల క్రితమే మృతిచెందారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement