సామూహిక ఆత్మహత్యలు?

Hindu Refugees Of Family From Pakistan Die - Sakshi

కలకలం

జోథ్‌పూర్‌ : రాజస్తాన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ నుంచి వచ్చిన హిందూ శరణార్ధుల కుటుంబంలో 11 మంది ఆదివారం జోద్‌పూర్‌లోని వారి ఇంట్లో మరణించిన ఘటన కలకలం రేపింది. ఘటన జరిగిన ప్రాంతంలో పురుగు మందుల వాసన వస్తుండటంతో విషవాయువులు విడుదలవడంతో వారు మరణించి ఉంటారని భావిస్తున్నారు. జోథ్‌పూర్‌ జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరంలోని దియోదు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మూకుమ‍్మడిగా ఆత్మహత్లకు పాల్పడిఉంటారని స్ధానికులు పేర్కొంటున్నారు. భారత పౌరసత్వం పొందేందుకు బాధిత కుటుంబం 2012లో పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రాంతం నుంచి భారత్‌కు తరలివచ్చింది. చదవండి : మార్చి లో పెళ్లి.. ఆగస్టులో ఆత్మహత్య

అప్పటి నుంచి వారు శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా ఎలా మరణించారనే కారణాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఇక ఘటన జరిగిన సమయంలో ఇంటిలో లేకపోవడంతో ఓ కుటుంబ సభ్యుడు ప్రాణాలతో బయటపడ్డారని స్ధానికులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో యూపీలోని శాంతిపూర్‌ ప్రాంతంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకోగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా పడిఉండటాన్ని గుర్తించారు. గత ఏడాది డిసెంబర్‌ 14న ఆర్థిక ఇబ్బందులతో తమిళనాడులోని మధురై ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top