గూగుల్‌ సీఈవో చిన్ననాటి ఇల్లు విక్రయం.. కన్నీటి పర్యంతమైన తండ్రి | Google CEO Sundar Pichai Chennai home sold | Sakshi
Sakshi News home page

గూగుల్‌ సీఈవో చిన్ననాటి ఇల్లు విక్రయం.. కన్నీటి పర్యంతమైన తండ్రి

May 21 2023 6:09 AM | Updated on May 21 2023 10:18 AM

Google CEO Sundar Pichai Chennai home sold - Sakshi

చెన్నై: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ చెన్నైలో తను పుట్టి పెరిగిన ఇంటిని విక్రయించారు. ఆ ఇంటిని కొనుగోలు చేసిన తమిళ నటుడు, నిర్మాత సి.మణికందన్‌ ఈ విషయం వెల్లడించారు. ఆస్తి పత్రాల అప్పగింత సమయంలో ఆయన తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. ‘ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలని అన్వేషిస్తుండగా చెన్నైలోని అశోక్‌ నగర్‌లో ఓ ఇల్లు ఉందని తెలిసింది. అది గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పుట్టి, పెరిగిన చోటని తెలియడంతో కొనుగోలు చేయాలని వెంటనే నిర్ణయించుకున్నా’అని మణికందన్‌ అన్నారు.

‘మన దేశానికి సుందర్‌ పిచాయ్‌ గర్వకారణంగా నిలిచారు. ఆయన నివసించిన ఇంటిని కొనుగోలు చేయడమంటే నా జీవితంలో గొప్ప ఆశయం సాధించినట్లేనని ఆనందం వ్యక్తం చేశారు. ఆస్తి పత్రాలు అందజేసే సమయంలో సుందర్‌ తండ్రి రఘునాథ పిచాయ్‌ కన్నీటి పర్యంతమయ్యారని చెప్పారు. ‘వారి ఇంటికి వెళ్లినప్పుడు సుందర్‌ తల్లి స్వయంగా ఫిల్టర్‌ కాఫీ చేసి తీసుకువచ్చారు. ఆయన తండ్రి ఆస్తి పత్రాలు ఇవ్వబోయారు’వారి నిరాడంబర వ్యవహార శైలి చూసి ఆశ్చర్యపోయా.

రిజిస్ట్రేషన్‌ ఆఫీసు వద్ద రఘునాథ గంటలపాటు వేచి ఉన్నారు. ఆస్తి పత్రాలను నాకు అప్పగించడానికి ముందు అన్ని పన్నులను ఆయనే చెల్లించారు. పత్రాలను నా చేతికి ఇచ్చేటప్పుడు ఆయన ఉద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు’అని మణికందన్‌ చెప్పారు. 1989లో ఐఐటీ ఖరగ్‌పూర్‌కు వెళ్లేవరకు సుందర్‌ పిచాయ్‌ కుటుంబం ఆ ఇంట్లోనే ఉంది. 20 ఏళ్లు వచ్చే వరకు సుందర్‌ పిచాయ్‌ ఆ ఇంట్లోనే గడిపినట్లు పొరుగు వారు చెప్పారు. సుందర్‌ గత ఏడాది చెన్నైలోని ఆ ఇంటికి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement