20 నిమిషాలు.. 10 కేజీల గోల్డ్‌.. రూ.35 లక్షలు | Gone In 20 Minutes: Bank Heist In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

20 నిమిషాలు.. 10 కేజీల గోల్డ్‌.. రూ.35 లక్షలు

Apr 18 2026 11:43 AM | Updated on Apr 18 2026 12:04 PM

Gone In 20 Minutes: Bank Heist In Madhya Pradesh

సింగ్రౌలీ: మధ్యప్రదేశ్‌లోని బ్యాంకు దోపిడీ కలకలం రేపింది. తుపాకులతో లోపలికి చొరబడిన దుండగులు.. కస్టమర్లు, బ్యాంకు సిబ్బందిని రూ. 15 కోట్ల విలువైన బంగారం(10 కేజీలు), రూ.35 లక్షల నగదుతో పరారయ్యారు. సింగ్రౌలీలో శుక్రవారం మధ్యాహ్నం(ఏప్రిల్‌ 17) సమయంలో ఐదుగురు దుండగులు  కస్టమర్ల ముసుగులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖ బ్యాంకులో ప్రవేశించారు. కేవలం 20 నిమిషాల్లో బంగారం, వెండి, రూ.35 లక్షల నగదుతో ఉడాయించారు.

మొదట ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించారు. లోపలికి రాగానే తుపాకులు తీసి సిబ్బందిని బెదిరించడం ప్రారంభించారు. వెంటనే మరో ముగ్గురు సహచరులు కూడా లోపలికి రావడంతో బ్యాంకు మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లిపోయింది. దోపిడీ దొంగలు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరపడంతో కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. లాకర్లు, నగదు నిల్వలకు సంబంధించిన తాళాలు ఇవ్వాలంటూ బ్రాంచ్ మేనేజర్‌ను బెదిరించారు. మేనేజర్ నిరాకరించడంతో అతని తలపై తుపాకీతో బలంగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత బలవంతంగా తాళాలు తీసుకున్నారు.

ఆ సమయంలో బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడం దొంగలకు కలిసి వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిని ఎవరూ అడ్డుకోలేకపోయారని.. క్షణాల్లో అంతా జరిగిపోయిందని ఓ కస్టమర్ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. నగరం వెలుపలికి వెళ్లే అన్ని దారులన్నీ మూసివేశారు. నిందితులను గుర్తించడానికి బ్యాంకు, పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది, కస్టమర్ల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement