Godse Was the Son Of India Not an Invader Like Aurangazeb - Sakshi
Sakshi News home page

గాడ్సే భారతీయుడు.. పరాయి దేశం నుండి వచ్చినవాడు కాదు..

Published Sat, Jun 10 2023 1:28 PM

Godse Was Son Of India Not Invader Like Aurangazeb  - Sakshi

న్యూఢిల్లీ: కొల్హాపూర్ అల్లర్ల తర్వాత అక్కడ పరిస్థితి సద్దుమణిగేలా ఉన్నా కానీ రాజకీయ నేతలు మాత్రం ఆ చిచ్చును ఆరనీయడం లేదు. అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన "గాడ్సే వారసులు" వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో గాంధీని చంపిన నాథూరాం గాడ్సే భరతమాత ముద్దుబిడ్డే అన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.       

టిప్పు సుల్తాన్, ఔరంగజేబులకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల నేపథ్యంలో కొల్హాపూర్ అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రజలు భయాందోళనతో ఉంటే  అవేమీ పట్టని రాజకీయ నాయకులు మాత్రం పరస్పర విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధానికి తెరతీశారు. 

కొల్హాపూర్ అల్లర్ల తర్వాత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ "ఔరంగజేబు వారసులు" అంటూ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ఔరంగజేబు వారసుల గురించి అంతా తెలిసిన మీకు గాడ్సే, ఆప్టేల వారసులు గురించి కూడా తెలిసి ఉండాలని వ్యాఖ్యలు చేశారు. 

తాజాగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో బీజేపీ మంత్రి గిరిరాజ్ సింగ్ నాథూరాం గాడ్సేను భరతమాత ముద్దుబిడ్డగా వర్ణించారు. మంత్రి ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గాడ్సే గాంధీ హంతకుడయితే గాడ్సే కూడా భరతమాత ముద్దుబిడ్డే కదా. ఆయన భారత దేశంలోనే పుట్టాడు. బాబర్, ఔరంగజేబుల మాదిరిగా పరాయి దేశం నుండి వచ్చినవాడు కాదు. బాబర్ వారసులుగా పిలవబడటానికి ఇష్టపడేవారు ఎప్పటికీ భరతమాత బిడ్డలు కాలేరని అన్నారు.  

ఇది కూడా చదవండి: రాసి పెట్టుకోండి.. బీజేపీ ఓడిపోతుంది..

Advertisement
 
Advertisement