తండ్రి, కూతుర్ల జిమ్.. వైరల్‌ వీడియో

Girl Lifts Weights As Dad Encourages Her In Viral Video - Sakshi

న్యూఢిల్లీ: ఒక చిన్నారి తన తండ్రి ప్రోత్సహించడంతో బరువులు ఎత్తే వీడియో ట్వీటర్‌లో వైరల్ అయ్యింది. నెటిజన్లకు ఇంటర్నెట్ అనేది ఎప్పుడూ చిరునవ్వును నింపే హృదయపూర్వక వీడియోల నిధి. అలాంటి ఒక క్లిప్.. తండ్రి, కుమార్తె మధ్య జరిగిన సన్నివేశాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

వైరల్ క్లిప్  ఏమిటి?
ఈ వైరల్ వీడియోను అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ట్విటర్‌లో షేర్ చేశాడు. "ఈ నాన్న, అతడి కుమార్తె ఈ రోజు నాకు అవసరమైన స్ఫూర్తిని ఇచ్చారన్న’’ సందేశంతో అనే శీర్షికతో రెక్స్ క్లిప్‌ను షేర్ చేశాడు. క్లిప్‌లో ఒక చిన్న అమ్మాయి జిమ్‌లో బరువులు ఎత్తడానికి ప్రయత్నిస్తుంటుంది. అప్పుడు చిన్నారి తండ్రి అక్కడి వచ్చి తన కుమార్తెను ప్రోత్సహించడం, ఆమెకు సూచనలు ఇవ్వడం కూడా వినవచ్చు. కొన్ని సెకన్ల తరువాత, అమ్మాయి బరువులు కొద్దిగా ఎత్తడానికి ప్రయత్నిస్తుంది, కానీ పూర్తిగా కాదు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ చిన్నారి చివరకు పెద్ద జంప్ తీసుకొని బార్‌ను పైకి ఎత్తుతుంది. తర్వాత ఉత్సాహంగా తన తండ్రిని ఆలింగనం చేసుకుని ముద్దు పెడుతుంది. ఈ క్లిప్ 2.6 మిలియన్లకు పైగా నెటిజన్లు చూసి ఆనందించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top