ఎగిరే వడాపావ్‌ చూశారా?

Flying Vada Pav: Mumbai Street Vendor Unique Dish Goes Viral - Sakshi

ముంబై: మీరు ఎగిరే దోశెను చూసుంటారు. కానీ ఎగిరే వడాపావ్‌ను చూసుంటారా? చూడకపోతే ఇది మీ కోసమే! మహారాష్ట్రలోని ముంబైకి చెందిన రఘు అనే వ్యక్తి టిఫిన్‌ బండి నడుపుతున్నాడు. అయితే అతడు తను చేసేది ఎంత రుచికరంగా ఉండాలనుకుంటాడో చేసే విధానం కూడా అంతే ఆసక్తికరంగా ఉండాలనుకున్నాడు. అందుకని జనాలను ఆకర్షించేందుకు తనకంటూ ఓ స్టైల్‌ ఏర్పరుచుకున్నాడు. ఓ చేత్తో వడను గాల్లోకి ఎగరేస్తూ మరో చేత్తో వాటిని అందుకుని పెనం మీద వేస్తున్నాడు. ఇదేదో కొత్తగా ఉండటంతో ఫుడ్‌ లవర్స్‌ అతడి బండి దగ్గరకు క్యూ కడుతున్నారు.

ప్రస్తుతం ఈ ఎగిరే వడాపావ్‌కు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు రున్నర లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించగా పలువురు నెటిజన్లు అతడి టాలెంట్‌ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అతడు కేవలం వడాపావ్‌ మాత్రమే కాకుండా దోశ, ఇడ్లీవడా వంటి ఇతర టిఫిన్స్‌ కూడా చేస్తాడట. మరి మీరూ అతగాడి చేతివంటను రుచి చూడాలంటే ముంబైలోని బోర బజార్‌ స్ట్రీట్‌కు వెళ్లాల్సిందే!

చదవండి: పులికి చుక్కలు చూపించిన కోతి.. వీడియో వైరల్‌‌

వైరల్‌: కాకి తెలివికి మెచ్చుకోవాల్సిందే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top