ఈవెనింగ్‌ టాప్‌ 10 తెలుగు న్యూస్‌ | Sakshi
Sakshi News home page

Evening Top 10 News Today: ఈవెనింగ్‌ టాప్‌ 10 తెలుగు న్యూస్‌

Published Tue, Jul 19 2022 5:55 PM

Evening Top 10 Telugu News Latest Updates Telugu Online News 18th July 2022 - Sakshi

1. అధికారం అంటే అజమాయీషీ కాదు.. అందరికీ సంక్షేమం: సీఎం జగన్‌
అధికారం అంటే అజమాయిషీ కాదు.. అధికారం అంటే ప్రజల మీద మమకారం.. ప్రజలందరి సంక్షేమం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ధి చేకూరేలా.. కొత్త లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన ప్రసంగించారు . 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమే: కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం మళ్లీ పాత పాటే అందుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభలో కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే.. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు
నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఆగస్టు 10వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నూపుర్ శర్మకు ప్రాణహాని ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. పువ్వాడ అనవసర విమర్శలు మానుకోవాలి
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడటాన్ని తప్పుపట్టారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. క్లౌడ్ బరస్ట్‌పై సీఎం కేసీఆర్‌ అలా.. గవర్నర్ తమిళిసై ఇలా..
క్లౌడ్ బరస్ట్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇప్పుడు వచ్చిన గోదావరి వరదలు క్లౌస్ బరస్ట్ వల్ల కాదని ఆమె అన్నారు. ఇవి ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే అని.. కాకపోతే ఈసారి కాస్త ఎక్కువ వరదలు వచ్చాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్‌ క్లారిటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోషల్‌ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు. ప్యాకేజీ ఫుడ్స్‌, ఆసుపత్రి బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడుపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో జీఎస్టీ వర్తించని  కొన్నివస్తువుల జాబితాను విడుదల చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. నానికి బిగ్‌ షాక్‌..ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా?
కెరీర్ బిగినింగ్ నుంచి చేతినిండా చిత్రాలతో ఎప్పుడూ బిజీగా కనిపించాడు నేనురల్‌ స్టార్‌ నాని. అయితే అంటే సుందరానికి తర్వాత ఈ స్పీడ్ తగ్గింది. చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా దసరా ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని  కోరుకుంటున్నాడు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. పేరుకే సౌతాఫ్రికా టి20 లీగ్‌.. అన్ని ఫ్రాంచైజీలు మనోళ్లవే.. మినీ ఐపీఎల్‌ తలపిస్తోంది
క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన లీగ్‌గా పేరు పొందింది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌). క్యాష్‌రిచ్‌ లీగ్‌గా ముద్రించుకున్న ఈ టోర్నీ ఆటగాళ్లకు కాసుల పంట పండిస్తుంది. వేలంలో కోట్ల రూపాయలను గుమ్మరించే ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు విదేశీ లీగ్‌ల్లోనూ తమ హవాను చూపించడం మొదలెట్టాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను.. నా బ్యూటీ సీక్రెట్‌ అదే!
బాలీవుడ్‌ తెరపై వెలిగిన మంగళూరు అందం శిల్పాశెట్టి. తన సౌందర్యంతో యువతను కట్టిపడేసి 90వ దశకంలో ఆరాధ్య హీరోయిన్‌గా మారింది. నటిగా, నిర్మాతగా, డాన్సర్‌గా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్‌
హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. తావడు డీఎస్పీ సురేంద్రసింగ్‌ బిష్ణోయ్‌ను దుండగులు దారుణంగా హతమార్చారు. నూహ్‌లో అక్రమంగా మైనింగ్ జరుగుతుందనే పక్కా  సమాచారంతో రైడింగ్‌కు వెళ్లిన ఆయనను.. మాఫియా గ్యాంగ్‌ ట్రక్కుతో తొక్కించి కిరాతకంగా చంపింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

తప్పక చదవండి

Advertisement