కర్ణాటక: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు టికెట్ ఇవ్వాలన్న ఎమ్మెల్యేల డిమాండ్ పై చర్చించడానికి డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ), డీఎన్‌ఏ, ఆర్‌సీబీ ప్రతినిధులతో సోమవారం భేటీ అయ్యారు. ఇంతకుముందు ఒక్కో ఎమ్మెల్యేకు 2 ఉచిత టికెట్లు ఇవ్వాలని అనుకోగా, ఈ భేటీలో దానిని 3కు పెంచడం గమనార్హం. బెంగళూరులో జరిగే ప్రతి మ్యాచ్‌కు 3 టికెట్లు ఇవ్వాలని తీర్మానించారు.
డీకే శివకుమార్ మాట్లాడుతూ 3 ఉచితమని, ఇంకా ఎక్కువ కావాలనుకునేవారు కొనుగోలు చేయాలని చెప్పారు. చిన్నస్వామి స్టేడియంలో సీట్లు పెంచాలని కేఎస్‌సీఏ ఆలోచిస్తోందని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని తెలిపామన్నారు. మరో క్రికెట్ స్టేడియాన్ని ఎక్కడ కట్టాలో అలోచిస్తున్నట్లు తెలిపారు. కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ పాల్గొన్నారు.


