ఇండియన్‌ కరెన్సీని ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా!

Do You Know How Much Does It Cost To Print Indian Currency Notes - Sakshi

డబ్బు.. గల్లీ నుంచి ప్రపంచ దేశాల వరకు ప్రతి ఒక్కరితో దీనితో అమితమైన సంబంధం ఉంటుంది. ఎన్ని చేతులు మారిన విలువ మారనిది డబ్బు ఒకటే. సంపాదిస్తే కానీ డబ్బు విలువ తెలీసిరాదంటారు. చాలామంది డబ్బు ద్వారానే విలువస్తుందని భావిస్తుంటారు. ఏ పని చేసినా దాని కోసమే. మనిషి జీవితాన్ని శాసించేది కూడా డబ్బే. డబ్బు సంపాదించడం కంటే దాన్ని పొదుపు చేయడం చాలా కష్టం.

చూడటానికి కాగితం ముక్కే కావచ్చు కానీ ఓ వ్యక్తి జీవితాన్నే మార్చేయగలదు. ఇలా  ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎన్నో విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి.మరి అలాంటి డబ్బులను ప్రింట్‌ చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా.. ఒక సాధారణ కాగితానికి 10,100.. నుంచి 2000 రూపాయల విలువ ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది. భారతీయ కరన్సీని ముద్రించడానికి అయ్యే ఖర్చు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

► 2018 నాటి డేటా ప్రకారం.. 10 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది.

►20 రూపాయల నోటును ముంద్రించడానికి 1 రూపాయి ఖర్చు అవుతుంది. అంటే దీనికి 10 రూపాయల నోటు కంటే తక్కువ ఖర్చు అవుతుంది.

► 50 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది.

►100 రూపాయల నోటును ముద్రించడానికి 1.51 పైసలు ఖర్చవుతుంది.

►200 రూపాయల నోటును ముద్రించడానికి 2.15 పైసలు ఖర్చవుతుంది. 

►500 రూపాయల నోటును ముద్రించడానికి 2.57 పైసలు ఖర్చవుతుంది.

►2000 రపాయల నోటును ముద్రించడానికి 4.18 పైసలు ఖర్చు అవుతుంది. 

వీటితో పాటు ప్రభుత్వం రద్దు చేసిన పాత 500, 1000 రూపాయల నోట్ల ఖర్చు కూడా చూసుకుంటే..

►పాత 500 రూపాయల నోటును ముద్రించడానికి 3.09 పైసలు ఖర్చు అవుతుంది. అంటే కొత్త 500 రూపాయల కంటే 52పైసలు అధికం.

►పాత 1000 రూపాయల నోటును ముంద్రించడానికి 3.54 పైసలు ఖర్చు అవుతుంది.  అంతే కొత్త 2000 రూపాయల కంటే 64 పైసలు తక్కువ.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top