రామ్‌దేవ్‌బాబాకు సమన్లు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

Delhi High Court Issues Summons To Baba Ramdev - Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు యోగా గురు రామ్‌దేవ్‌బాబాకు గురువారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మెడికల్‌ అసోషియేషన్‌ దాఖలు చేసిన దావాపై విచారణ జరిపి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ సమయం వరకు ఆయన ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది. కాగా, కొరోనిల్ టాబ్లెట్‌పై రామ్‌దేవ్‌బాబా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ డీఎంఏ ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. కొరోనిల్‌తో కరోనా తగ్గుతుందా లేదా అన్నది నిపుణులు తేల్చాలి.. కొరోనిల్‌కు సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.

అంతకు కొద్దిరోజుల క్రితం ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌(ఐఎమ్‌ఏ) రామ్‌దేవ్‌ బాబాపై పోలీసు కంప్లైంట్‌ ఇచ్చింది. ఆయన  అల్లోపతిపై తప్పుడు, అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని కంప్లైంట్‌లో పేర్కొంది. ఆమోదింపబడ్డ పద్ధతిలో కరోనా రోగులకు అందిస్తున్న వైద్యంపై, ఉపయోగిస్తున్న మందులపై తరచూ.. ఉద్దేశ్యపూర్వకంగా ఆయన నిరాధార, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top