స్వగ్రామానికి అమర జవాను మృతదేహం | CRPF Jawan Kabir Mortal Remains Brought to his Residence | Sakshi
Sakshi News home page

స్వగ్రామానికి అమర జవాను మృతదేహం

Jun 13 2024 1:27 PM | Updated on Jun 13 2024 1:27 PM

CRPF Jawan Kabir Mortal Remains Brought to his Residence

రెండు రోజల్లో ఇంటికి వస్తానని చెప్పిన ఆ జవాను ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యాడు. ఈ విషయం తెలియని అతని తల్లి కొడుకు రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంతలో అతని మృతదేహాన్ని సీఆర్‌పీఎఫ్‌ అధికారులు ఇంటికి తీసుకురావడంతో, ఆ తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది.

జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను కబీర్ సింగ్ ఉయికే అమరుడయ్యాడు. అతని మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకురాగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా కబీర్‌ సింగ్‌ తల్లి మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల్లో వస్తానని చెప్పిన కుమారుడు ఇలా విగతజీవిగా వస్తాడని అనుకోలేదని అన్నారు.

జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యం చాలా కాలంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూన్ 11న సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో కబీర్ సింగ్ ఉయికే తీవ్రంగా గాయపడి అమరుడయ్యారు.

సీనియర్ సీఆర్‌పీఎఫ్ అధికారులు కబీర్ మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకువచ్చారు. కబీర్‌ తల్లిని డీఐజీ నీతూ ఓదార్చారు. కథువా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, ఒక సీఆర్‌పీఎఫ్ జవాను వీరమరణం పొందారు. కాగా కథువాలో సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ఆనంద్ జైన్ తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement