breaking news
brought
-
‘బంగ్లా’ గర్భిణి సునాలి కథ సుఖాంతం
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌లో అక్రమ వలసదారుగా అనుమానిస్తూ, బంగ్లాదేశ్‌కు తరలించిన గర్భిణి సునాలి ఖాతున్ (25), ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నారు. గత ఐదు నెలలుగా ఆమె జరిపిన న్యాయ పోరాటం దరిమిలా, సుప్రీంకోర్టు ఈ ఉదంతంలో జోక్యం చేసుకుంది. మానవతా కారణాలతో ఆమె భారత్‌లో ప్రవేశించేందుకు అనుమతించింది. ఈ నేపధ్యంలో ఆ తల్లీకొడుకులు పశ్చిమ బెంగాల్‌లోని మెహదీపూర్ సరిహద్దు అవుట్‌పోస్ట్ మీదుగా భారత భూభాగంలోకి అడుగుపెట్టారు.పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో ఉంటున్న సునాలి, ఆమె భర్త డానిష్ షేక్‌లను జూన్ 26న ఢిల్లీ పోలీసుల అరెస్ట్ చేసి, సరిహద్దు మీదుగా బంగ్లాదేశ్‌కు తరలించారు. అయితే సునాలి ఆమె కుమారుడిని తిరిగి భారత్ తీసుకురావడంలో సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు విజయం సాధించారు. ఇందుకోసం కృషి చేసిన బిర్భూమ్‌కు చెందిన సామాజిక కార్యకర్త మోఫిజుల్ ఇస్లాం మాట్లాడుతూ.. సునాలి, ఆమె కుమారుడిని తిరిగి తీసుకురావడంలో తాము విజయం సాధించినప్పటికీ, సునాలి భర్త డానిష్, మరో మహిళ స్వీటీ బీబీతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు ఇప్పటికీ బంగ్లాదేశ్‌లోనే ఉన్నారని తెలిపారు.వారి భారత పౌరసత్వాన్ని కేంద్రం సవాలు చేస్తున్నందున, దానిని పరిష్కరించి, వారిని తిరిగి తీసుకువచ్చే వరకు విశ్రమించబోమని ఇస్లాం పేర్కొన్నారు. ఈ కుటుంబాలు బంగ్లాదేశ్‌లో పాస్‌పోర్ట్, విదేశీయుల చట్టం కింద అరెస్టు అయ్యారు. అయితే వారికి డిసెంబర్ ఒకటిన బెయిల్ లభించింది. గతంలో సునాలి భారతదేశంలోనే తన బిడ్డకు జన్మనివ్వాలని భావించింది. కలకత్తా హైకోర్టు సెప్టెంబర్ 26న రెండు కుటుంబాలలోని ఆరుగురు సభ్యులను నాలుగు వారాల్లోగా తిరిగి తీసుకురావాలని ఆదేశించింది. అక్టోబర్ 3న చపైనావాబ్‌గంజ్ జిల్లా కోర్టు కూడా ఆధార్ కార్డుల ఆధారంగా వారిని భారతీయ పౌరులుగా ప్రకటించి, తిరిగి పంపాలని ఆదేశించింది.సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోలేకపోయిందని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సమీరుల్ ఇస్లాం తన ‘ఎక్స్’ హ్యాండిల్లో పేర్కొన్నారు. న్యాయవాదులు ఈ విషయాన్ని మరోసారి సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించిన తర్వాతే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. కాగా బాధితురాలు సునాలి, ఆమె కుమారుడు భారత్ వచ్చిన వెంటనే పశ్చిమ బెంగాల్ పోలీసులు వారిని మాల్డా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (సీఎంఓహెచ్)సుదీప్తో భాదురి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు వారిద్దరినీ కనీసం 24 గంటలు వైద్య పర్యవేక్షణలో ఉంచుతామన్నారు. సునాలికి రక్త లోపం ఉందని, వైద్యుల బృందం ఆమె పరిస్థితిని అంచనా వేసి, అవసరమైన వైద్య సాయం అందిస్తుందన్నారు. ఇది కూడా చదవండి: టపాసులే కాదు.. కొత్త క్యాలెండర్లు కూడా.. -
స్వగ్రామానికి అమర జవాను మృతదేహం
రెండు రోజల్లో ఇంటికి వస్తానని చెప్పిన ఆ జవాను ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యాడు. ఈ విషయం తెలియని అతని తల్లి కొడుకు రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంతలో అతని మృతదేహాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు ఇంటికి తీసుకురావడంతో, ఆ తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది.జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాను కబీర్ సింగ్ ఉయికే అమరుడయ్యాడు. అతని మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకురాగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా కబీర్ సింగ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల్లో వస్తానని చెప్పిన కుమారుడు ఇలా విగతజీవిగా వస్తాడని అనుకోలేదని అన్నారు.జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యం చాలా కాలంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూన్ 11న సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో కబీర్ సింగ్ ఉయికే తీవ్రంగా గాయపడి అమరుడయ్యారు.సీనియర్ సీఆర్పీఎఫ్ అధికారులు కబీర్ మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకువచ్చారు. కబీర్ తల్లిని డీఐజీ నీతూ ఓదార్చారు. కథువా ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, ఒక సీఆర్పీఎఫ్ జవాను వీరమరణం పొందారు. కాగా కథువాలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ఆనంద్ జైన్ తెలిపారు. #WATCH | CRPF jawan Kabir Das Uikey's mother, Indravati Uikey says, "Before the incident, he spoke to me around 2 pm. He was supposed to return home on soon." pic.twitter.com/O5k04CwAVx— ANI (@ANI) June 13, 2024 -
మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే..?
తొలిరోజు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ప్రధాన నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు(డబ్ల్యూఆర్‌బీ) ఆమోదిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీపై ఒక్కసారిగా ప్రశంసలు వెల్లువెత్తాయి. మహిళా రిజర్వేషన్ డిమాండ్‌ను నెరవేర్చే నైతిక ధైర్యం మోదీ ప్రభుత్వానికి మాత్రమే ఉందంటూ అభినందనల జల్లు వెల్లువెత్తింది. ఇవాళే లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి రామ్ మెగ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. రేపే లోక్‌సభలో ఆమెదం పొందనుంది. తదనంతరం రాజ్యసభ ముందుకు వెళ్తుంది. ఈ సందర్భంగా "మహిళా రిజర్వేషన్ బిల్లు" అంటే ఏమిటి? దీన్ని ఎప్పుడూ తీసుకొచ్చారు. ఇన్నేళ్ల నిరీక్షణకు గల కారణం తదితరాల గురించే ఈ కథనం. మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే.. దేశంలో లింగ విబేధం లేకుండా అందరికి సమాన హక్కులు ఉండాలని.. అన్ని మతాలు, వర్గాలు, సంస్కృతులు సమానంగా ఉండాలన్న ఆంక్షతో స్వాతంత్య్రం సాధించుకున్నాం. కానీ... పురుషుల ఆధిపత్యం ఎక్కువై.. మహిళల ప్రాధాన్యత తగ్గుతూ ఉండటంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రాధాన్యత పెరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే... రాజ్యంగం 108వ సవరణ బిల్లు, 2008 లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు(33%) మహిళలకు రిజర్వ్ చేయాలని కోరింది. 33 శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్ల సబ్ రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదిస్తుంది. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్డ్ సీట్లను మార్చాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. Union MoS Prahlad Patel deletes his post on 'Women's Reservation Bill'. pic.twitter.com/N8PeEvg5kV — Press Trust of India (@PTI_News) September 18, 2023 ఈ బిల్లు చరిత్ర... మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మే 1989లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టడం ద్వారా పార్లమెంట్లో మహిళ రిజర్వేషన్ బిల్లుకి బీజం పడిందని చెప్పాలి. ఆయన ప్రవేశ పెట్టిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది కానీ 1989 సెప్టెంబర్‌లో రాజ్యసభలో ఆమోదం పొందడంలో విఫలమైంది. 1992, 1993లో అప్పటి ప్రధాని పీ వీ నరసింహరావు రాజ్యాంగ సవరణ బిల్లు 72, 73లను తిరిగి ప్రవేశ పెట్టారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు 33% రిజర్వ్ చేశారు. బిల్లులు ఉభయ సభలు ఆమోదించాయి. చట్టంగా మారాయి. దీంతో దేశ వ్యాప్తంగా పంచాయితీలు, నగరాల్లో దాదాపు 15 లక్షల మంది మహిళా ప్రతినిధులు ఎంపికయ్యారు. తొలిసారిగా ఎప్పడూ ప్రవేశపెట్టారంటే.. సెప్టెంబర్ 12, 1996 అప్పటి దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలిసారిగా పార్లమెంట్లో మహిళ రిజర్వేషన్ కోసం 81వ రాజ్యంగా సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. ఐతే లోక్‌సభలో ఆమోదం పొందలేకపోవడంతో గీతా ముఖర్జీ అధ్యక్షతన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు. డిసెంబర్ 1996లో ముఖర్జీ కమిటీ తన నివేదికను సమర్పించింది. అయితే లోక్‌సభ రద్దు కారణంగా బిల్లు రద్దయింది. ఇక రెండు సంవత్సరాల తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 1998లో 12వ లోక్‌సభలో ఈ మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ సారి కూడా బిల్లుకు మద్దతు లభించలేదు. పైగా రద్దైపోయింది. మళ్లీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999,2002, 2003లో తిరిగి ప్రవేశ పెట్టారు, కానీ విజయవంతం కాలేదు. ఐదేళ్ల తర్వాత మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కొంత పట్టు సాధించింది. 2004లో ప్రభుత్వం తన సాధారణ కార్యక్రమంలో ఈ బిల్లుని భాగస్వామ్యం చేసింది. చివరకు మే 6, 2008న రాజ్యసభలోకి ప్రవేశపెట్టింది. ఈసారి రద్దవ్వకుండా నిరోధించేలా 1996 గీతా ముఖర్జీ కమిటీ చేసిన ఏడు సిఫార్సులలో ఐదింటిని ఈ బిల్లు సంస్కరణలో చేర్చడం జరిగింది. ఆ చట్టం మే 9, 2009న స్థాండింగ్ కమిటీకి పంపించారు. స్టాండింగ్ కమిటీ తన నివేదికను డిసెంబర్ 17, 2009న సమర్పించింది. దీనికి ఫిబ్రవరి 2010లో కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోద ముద్ర పొందింది. చివరికి ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదించబడింది. మార్చి 9, 2010న 186-1 మోజార్టీ ఓట్లు పడ్డాయి. అయితే ఈ బిల్లు లోక్‌సభలో పరిశీలనకు తీసుకోలేదు. చివరికి 2014లో లోక్‌సభ రద్దుతో ముగిసిపోయింది. నిజానికి రాజ్యసభలో ప్రవేశపెట్టిన లేదా ఆమోదించన ఏ బిల్లు అంత తేలిగ్గా ముగియదు. అందువల్లే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా వీగిపోలేదు. కాగా, ఇప్పుడూ కొత్త పార్లెమంట్ భవనంలో మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళ రిజర్వేషన్ బిల్లుతో అధికార, ప్రతిపక్ష పార్టీలు సమావేశం కావడం విశేషం. ఇక ప్రధాని సైతం ఈ చారిత్రత్మక నిర్ణయానికి దేవుడు తనను ఎంచుక్నున్నాడంటూ భావోద్వేగం చెందారు. ఈ బిల్లుకు నారీశక్తి వందన్ అనే పేరు కూడా పెట్టారు. ఈ బిల్లు కోసం కేంద్రం 128వ రాజ్యంగ సవరణ చేయనుంది కేంద్రం. అంతా అనుకూలంగా జరిగి ఈ బిల్లు పాసైతే మహిళలకు 33 శాతం సీట్లు లభిస్తాయి. 15 ఏళ్ల పాటు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లో ఉంటుంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ చారిత్రాత్మక బిల్లుకి మోక్షం కలగాలాని ఎందరో మహళలు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. It’s been a long-standing demand of the Congress party to implement women’s reservation. We welcome the reported decision of the Union Cabinet and await the details of the Bill. This could have very well been discussed in the all-party meeting before the Special Session, and… https://t.co/lVI9RLHVY6 — Jairam Ramesh (@Jairam_Ramesh) September 18, 2023 (చదవండి: దేవదూతలందరికీ రెక్కలు ఉండవ్!... ! కొందరికి స్టెతస్కోప్‌లే ఉంటాయ్!!) -
అదంతా కొడుకు మహిమేనట...
-
అదంతా కొడుకు మహిమేనట...
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ క్యాపిటల్ అధిపతి అనిల్ అంబానీ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. వాటాదారుల వార్షిక సాధారణ సమావేశంలో తన కుమారుడు, బోర్డ్ లో కొత్త డైరెక్టర్ అన్మోల్ అంబానీ (24) పరిచయం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాక కంపెనీకి "అద్భుతమైన అదృష్టం" తెచ్చిపెట్టిందని అనిల్ పొంగిపోయారు. అన్మోల్ నియామకం తరువాత షేర్ ధర 40 శాతం పెరిగిందనీ, భవిష్యత్తులో కూడా ఆ ప్రభావం కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన వాటాదారుల సమావేశంలో ఫుల్ టైం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అన్మోల్ నియామకానికి ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అన్మోల్ యొక్క నియామకానికి ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చెప్పిన వాటాదారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ జనాభాలో 30 సంవత్సరాల సగటు వయస్సు గా ఉంటే, తమ రిలయన్స్ క్యాపిటల్ ఉద్యోగుల సగటు వయస్సు 34 సంవత్సరాలని అనిల్ పేర్కొన్నారు. అన్మోల్ రాక సంస్థకు అదృష్టం తెచ్చిపెట్టిందనీ, మెరుగైన పనితీరు, టీమ్ వర్క్ ఆధారంగా సంస్థ అభివృద్ధిలో 'అన్మోల్ ప్రభావం' ఇక ముందు కూడా కొనసాగుతుందని విశ్వసిస్తున్నానని చైర్మన్ చెప్పారు. కాగా లండన్ వార్విక్ బిజినెస్ స్కూల్ నుండి డిగ్రీ పొందిన అన్మోల్, రిలయన్స్ కాపిటల్ మండలిలో పూర్తి కాలపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియామకమైన సంగతి తెలిసిందే. సుమారు రూ .4,000 కోట్ల ఆదాయంతో, రిలయన్స్ క్యాపిటల్ జీవిత భీమా, వాణిజ్య ఆర్ధిక, సెక్యూరిటీలు, సాధారణ ఫైనాన్స్ , మ్యూచువల్ ఫండ్స్ సేవలను అందిస్తోంది. కాగా అన్మోల్ నియామకానికి ముందు రూ.467 గా వున్న షేర్ ధర రూ.575 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో సంభవించిన షార్ప్ ర్యాలీ ద్వారా గత ఏడాదిగా దాదాపు 70 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2014నుంచి సంస్థకు సేవలందిస్తున్న అన్మోల్ .. రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో ఛైర్మన్ అనిల్ అంబానీ తర్వాత ఆయన పెద్ద కుమారుడుగా ఏకైక ఇతర కుటుంబ సభ్యుడు కావడం విశేషం. -
అర్దరాత్రి సాక్షులను తీసుకొచ్చిన పోలీసులు


