
చిన్నారులపై ఏటా పెరుగుతున్న నేరాలు
2023లో దేశంలో 1,77,335 కేసులు నమోదు
2022తో పోలిస్తే ఏపీలో తగ్గిన తగ్గిన కేసులు
ఛార్జిషీటు నమోదు రేటులో ఏపీ టాప్–2
ఎన్‌సీఆర్‌బీ – 2023 నివేదికలో వెల్లడి
దేశంలో చిన్నారులపై నేరాలు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయిగానీ తగ్గడం లేదు. 2021లో 1.49 లక్షల నుంచి 2022లో 1.62 లక్షలకు, 2023లో 1,77,335కి పెరిగాయి. 2023లో మొత్తం బాధితుల సంఖ్య 1,86,521. 28 రాష్ట్రాల్లో.. 10వేలకుపైగా బాధితులు ఉన్న రాష్ట్రాలు 6 ఉండటం గమనా ర్హం.
మొత్తం కేసుల్లో కిడ్నాపులు / అపహరణలే అత్యధికం కావడం ఆందోళనకరం. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 2022తో పోలిస్తే కేసులు పెరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో తగ్గాయి. అత్యధిక నేరాలు జరిగిన టాప్ –15 రాష్ట్రాల జాబితాలో కూడా ఏపీ లేకపోవడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్

