
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం కీలక నిర‍్ణయం తీసుకుంది. లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను అందుబాటులో ఉంచే విధంగా సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కరోనా చికిత్సలో కీలకమైన ప్రాణాలను రక్షించే అత్యవసర మందులు, ముఖ్యమైన వైద్య పరికరాలకు సంబంధించి "జాతీయ నిల్వ" ను ఏర్పాటు చేయడానికి కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు ఫార్మా, వైద్య పరికరాల సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఇందుకు గాను ఔషధాల విభాగం కింద, వైద్య పరికరాలను ట్రాక్ చేయడానికి కేంద్రం నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం కోవిడ్-19 మహమ్మారి థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేలా స్టాక్‌పైల్ నొక దాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది తద్వారా ముఖ‍్యమైన యాంటీబయాటిక్స్ ఇతర కీలకమైన ఔషధాల, ఆక్సిజనేటర్లు తదితర పరికరాల లభ్యతను సమీక్షించడంతోపాటు కొరత నివారణకు కృషిచేయనుంది. అలాగే వీటి సరఫరా గొలుసు బలోపేతానికి, తయారీ ప్రక్రియలో అవాంతరాల పరిష్కారంలో కూడా సహాయపడుతుంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పని చేస్తున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ వెల్లడించారు. రానున్న విపత్తుకు తామంతా సంసిద్ధంగా ఉండాల్సి ఉందని పేర్కొన్నారు. అలాగే ఆయా కంపెనీలు కూడా త్వరితగతిన ఉత్పత్తుల సష్టిపై దృష్టిపెడతాయన్నారు. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో క్లిష్టమైన ఔషధాల సరఫరా వేగవంతమవుతుందన్నారు.
కరోనా రెండో వేవ్ సృష్టించిన విలయం, ఈ సమయంలో ఆక్సిజన్ కొరత, పల్స్ ఆక్సిమీటర్లు లాంటి వైద్య పరికరాల కొరత, రెమ్‌డెసివర్, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే టోసిలిజుమాబ్ , అమ్ఫోటెరిసిన్-బి లాంటి ముఖ్యమైన ఔషధాల కోసం బాధితుల కష్టాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ నిల్వను సృష్టించడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి కొరతలను నివారించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా చికిత్సలో కీలక ఔషధాల లభ్యతపై సమీక్ష , అలాగే బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన మందుల లభ్యతపైనా వివరాలను సేకరిస్తుంది. దీనికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ కీలక పరికరాలను షార్ట్ లిస్ట్ చేయనుంది. అలాగే రోజువారీ ప్రకారం ఇతర భాగస్వామముల సలహాలను కూడా తీసుకుంటుంది.
చదవండి : గుడ్‌న్యూస్: మోడర్నాకు గ్రీన్ సిగ్నల్, 90 శాతం సమర్థత
Flipkart Monsoon Sale 2021: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు