‘చార్‌ధామ్‌’కు కోవిడ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి కాదు

Covid-19 test, jab certificate not mandatory for Char Dham yatra - Sakshi

డెహ్రాడూన్‌: ఈ నెల 3వ తేదీ నుంచి మొదలయ్యే చార్‌ధామ్‌ యాత్రలో పాల్గొనే భక్తులు కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు/ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలన్న నిబంధనను ఎత్తివేసినట్లు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు సౌకర్యంగా ఉండేందుకు, సరిహద్దుల వద్ద వారు వేచి చూడాల్సిన అవసరం లేకుండా కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు /వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ నిబంధనను ప్రస్తుతానికి తొలగించినట్లు వివరించింది. పర్యాటక శాఖ పోర్టల్‌లో యాత్రికుల సంఖ్య ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top