2 వేలకు పైగా కొత్త కేసులు...మళ్లీ మాస్క్‌ ధరించాల్సిందే

COVID-19 India reports And Daily Positivity Rate  - Sakshi

న్యూడిల్లీ: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టింది అనుకునేలోపే అనూహ్యంగా కేసులు పెరగడం కొంత ఆందోళనకు గురి చేస్తోంది.  అయితే మంగళవారం దేశంలో తాజాగా 2,483 కరోనా కేసులు నమోదవ్వడంతో భారత్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం1 5,636 యాక్టివ్ కేసుల ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 43,06,02,569కి చేరింది. గత 24 గంటల్లో 1,970 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,25,23,311కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, రోజువారీ పాజివిటీ రేటు 0.55 శాతానికి చేరిందని పేర్కొంది.

ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో 1,011 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాజధానిలో పాజిటివిటీ రేటు 6.42 శాతానికి పెరిగింది. అంతేకాకుండా, అధికారిక డేటా ప్రకారం..  ఏప్రిల్‌ 11న 447 మందికి ఉన్న కరోనా రోగుల సంఖ్య ఏప్రిల్ 24 నాటికి 2,812 కి చేరుకుంది. పైగా ఆసుపత్రుల్లో చేరిన రోగుల సంఖ్య కూడా 17 నుంచి 80కి పెరిగింది.

దీంతో దేశ రాజధాని ఢిల్లీతో సహా అన్ని రాష్రాలు అప్రమత్తమయ్యాయి. అంతేకాదు మళ్లీ మాస్క్‌ పాటించేలా నిబంధనలు అమల్లోకి తీసుకు రావడమే కాకుండా బౌతిక దూరం పాటించాలని ఆదేశిస్తున్నాయి. మరోవైపు దేశంలో వేక్సినేషన్‌ ప్రక్రియ నిరాంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 187 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

(చదవండి: మోదీతో ఈయూ చీఫ్‌ భేటీ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top