India Covid Cases 31st May 2021: తాజాగా లక్షా 27 వేల కేసులు, 3 వేల మరణాలు - Sakshi
Sakshi News home page

తాజాగా లక్షా 27 వేల కేసులు, 3 వేల మరణాలు

Published Tue, Jun 1 2021 9:49 AM

Corona Virus: India Covid Report June 1st 2020 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రెండో విడత కరోనా వైరస్ విజృంభణ తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకు కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నాయి. తాజాగా లక్షన్నరకు దిగువకు రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదైంది. 24 గంటల్లో 1,27,510 కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,795 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,55,287 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జయ్యారు.

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,81,75,044. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,95,520. కరోనాకు చికిత్స పొంది ఇప్పటివరకు డిశ్చార్జయిన వారి మొత్తం సంఖ్య 2,59,47,629. దేశంలో మొత్తం కరోనా మృతులు 3,31,895. దేశంలో 91.60 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండడం గమనార్హం. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.22 శాతం. మొత్తం కేసులలో మరణాల రేటు 71.16 శాతంగా ఉంది. ఇక వ్యాక్సిన్‌ ప్రక్రియలో కొంత వేగం పెరిగింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 27,80,058 మంది  కరోనా వాక్సిన్ తీసుకున్నారు.


చదవండి: భయాందోళన వద్దు.. ఈనెలలోనే కరోనా తగ్గుద్ది
 

Advertisement
Advertisement