కరోనా టీకా పంపిణీకి 80 వేల కోట్లు ఉన్నాయా? 

Corona Vaccine: Will Central Govt Have Rs 80000 Crore - Sakshi

పుణే: దేశ ప్రజలందరికీ అవసరమైన కరోనా వ్యాక్సిన్లు కొని, సరఫరా చేయడానికి అక్షరాలా రూ.80 వేల కోట్లు అవసరమని, ఈ సొమ్ము కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా? అని పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈవో అదార్‌ పూనావాలా ప్రశ్నించారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేయడానికి ఎస్‌ఐఐ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

కరోనా వ్యాక్సిన్ల కోసం సంవత్సరంలోగా రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అదార్‌ పూనావాలా చెప్పారు. ఇప్పడు మన ముందున్న అతి పెద్ద సవాలు ఇదేనని వివరించారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు పంపిణీ చేయడానికి 3 డాలర్లకు ఒక వ్యాక్సిన్‌ డోసు చొప్పున ఉత్పత్తి చేస్తామని ఎస్‌ఐఐ ఇటీవలే ప్రకటించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top