
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నవంబర్ 3వ తేదీకి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దాని ప్రకారం ఇప్పటి వరకు దేశంలో 83,13,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద 46,253 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 514 మంది మృతి చెందారు. ఇదిలా వుండగా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల కంటే డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,357 మంది డిశార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,33,787 కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తం ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయినవారు 76,56,478 మంది. ఇక ఈ వైరస్ సోకి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 1,23,611 మంది మృతి చెందారు. మరోవైపు కరోనా రికవరీ రేటు కూడా చాలా ఎక్కువగానే ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 92.09 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన కేసులలో మొత్తం యాక్టివ్ కేసులు కేవలం 6.42 శాతం మాత్రమే. ఈ మరణాల శాతం మొత్తం నమోదయిన కేసులలో 1.49 శాతంగా ఉన్నాయి.