IND: కరోనా రెడ్ అలర్ట్.. భయపెడుతున్న కేసులు, మరణాలు

Corona Cases Updates In India.. దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలవరపాటుకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు.. 20వేలపైనే నమోదు అవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 21,411 కరోనా కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్ కారణంగా 67 మంది మృత్యువాతపడ్డారు. ఇక, కరోనా నుంచి 20,726 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,50,100 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు.. మొత్తం కేసులు 4,38,68,476కు చేరుకోగా.. కరోనా మృతుల సంఖ్య 5,25,997 మందికి చేరుకుంది.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,31,92,379 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటివరకు 201.68 కోట్ల కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది.
#COVID19 | India reports 21,411 fresh cases, 20,726 recoveries and 67 deaths in the last 24 hours.
Active cases 1,50,100
Daily positivity rate 4.46% pic.twitter.com/jxr8ep9utB— ANI (@ANI) July 23, 2022
ఇది కూడా చదవండి: అప్పుడు ప్రధాని మోదీ, ఇప్పుడు సీఎం యోగికి షాకిచ్చిన బీజేపీ ఎంపీ