India Covid Updates: India Reports 20,409 New Corona Cases In Last 24 Hours - Sakshi
Sakshi News home page

India Covid Updates: జర జాగ్రత్త.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

Jul 29 2022 10:31 AM | Updated on Jul 29 2022 11:13 AM

Covid Cases Updates In India On 29 July 2022 - Sakshi

Corona cases Updates.. దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. అయితే, కొద్దిరోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20వేలపైనే ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక, మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 20,409 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అదే సమయంలో 32 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,43,988 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక, కరోనా నుంచి ఇప్పటి వరకు 4,33,09,484 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 5,26,258 మంది కరోనా కారణంగా మృతిచెందారు. మరోవైపు.. 2,03,60,46,307 మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. 

ఇది కూడా చదవండి: 17 ఏళ్లకే ఓటర్‌ కార్డు దరఖాస్తుకు అవకాశం.. ఈసీ కీలక నిర్ణయం

Advertisement
 
Advertisement
Advertisement