సీఎం యోగి ఔర్‌ ఏక్‌.. మదర్సాలకు షాక్

UP CM Yogi Govt Accepts Proposal To Stop Grants For New Madrasas - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు మరో కీలకమైన నిర్ణయంతో సంచలనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మదర్సాలకు ఎటువంటి నిధులు ఇవ్వకూడదన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఆయన కేబినెట్‌. దీంతో యూపీలోని చాలావరకు మదర్సాలకు ప్రభుత్వం నుంచి ఇకపై రూపాయి అందదు. 

మదర్సాలు అన్నీ కూడా జాతీయ గీతం ఆలపించడాన్ని ఇటీవలే యోగి సర్కారు తప్పనిసరి చేసింది. మదర్సాల్లో తరగతులు ఆరంభానికి ముందు విద్యార్థులు, టీచర్లు అందరూ జాతీయగీతం ఆలపించాలంటూ మైనారిటీ శాఖ ఈ నెల 12న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఇచ్చిన వారం వ్యవధిలోనే.. కొత్త మదర్సాలను ప్రభుత్వ నిధుల సాయం నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వం నిధుల సాయం నుంచి కొత్త సంస్థలనే మినహాయించారు. యూపీ సర్కారు మదర్సాల ఆధునికీకరణ పథకానికి గత బడ్జెట్ లో రూ.479 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధులతో మదర్సాలను ఆధునికీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 వేలకుపైగానే మదర్సాలు ఉన్నాయి. కానీ, వాటిలో 558 మదర్సాలకు మాత్రమే ప్రభుత్వం నిధులను అందించనుంది. దీంతో మిగిలిన వేలాది మదర్సాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధుల సాయం అందదు.

చదవండి: కశ్మీరీ ఫైల్స్‌.. రక్తపు కూడు సీన్లు ఏంటసలు?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top