UPSC Result 2021: Cloth Vendors Son Anil Bosak Ranks 45 in UPSC Exam - Sakshi
Sakshi News home page

UPSC Result 2021: సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కుమారుడు..

Sep 26 2021 9:55 AM | Updated on Sep 26 2021 1:50 PM

Cloth Vendors Son Crack UPSC Civil Services Examination In Bihar - Sakshi

ఐటీ తర్వాత అనిల్‌ ఉద్యోగంలో చేరతాడని అనుకున్నాను. తను.. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం అవుతానని చెప్పాడు. ఆ సమయంలో...

పట్నా(బిహార్‌): యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో  బిహార్‌లోని కిషన్‌ గంజ్‌ జిల్లా నిరుపేద కుటుంబానికి చెందిన అనిల్‌ బొసక్‌ తన మూడో ప్రయత్నంలో 45వ ర్యాంక్‌ సాధించారు. ఆయన ఢిల్లీ ఐఐటీ 2018 బ్యాచ్‌ విద్యార్థి. అనిల్‌ తండ్రి వినోద్‌ సైకిల్‌పై గ్రామాల్లో తిరుగుతూ దుస్తులు అమ్ముతుంటారు. ప్రతిష్టాత్మక యూపీఎస్సీ ఫలితాల్లో అనిల్‌ జాతీయ స్థాయి ర్యాంకు సాధించడంతో ఆ కుటుంబం పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది.

తండ్రి వినోద్‌ కుమారుడి సక్సెస్‌పై స్పందిస్తూ.. ‘ఐఐటీకి అనిల్‌ ఎంపికైనప్పుడు చాలా సంతోషపడ్డాం. యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో అతని టీచర్‌ చాలా సాయం చేశారు. కష్టసాధ్యమైన యూపీఎస్సీకి అనిల్‌ బోసక్‌ ఎంపిక కావడం కలగా ఉంది. ఐఐటీ తర్వాత అనిల్‌ ఉద్యోగంలో చేరతాడని అనుకున్నాను. తను.. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం అవుతానని చెప్పాడు. మా అబ్బాయికి ఉపాధ్యాయులు కూడా ఎంతో చేయుతనందించారు.

తొలుత కష్టతరమని భావించిన అనిల్‌ పడుతున్న కష్టం చూసి నా వంతుగా నేను కూడా.. సహాకారం అందించాను. ఇప్పుడు నా కొడుకు విజయంచూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. గతేడాది యూపీఎస్సీ పరీక్షలో 616 ర్యాంకు సాధించిన అనిల్‌ ఈసారి మరింత కష్టపడి 45వ ర్యాంక్‌ సాధించి తన కలను సాకారం చేసుకున్నాడని వినోద్‌ ఆనందం వ్యక్తం చేశాడు.  

చదవండి: మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రుల సంఖ్య పెరగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement