breaking news
national rank
-
సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కుమారుడు..
పట్నా(బిహార్): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బిహార్‌లోని కిషన్ గంజ్ జిల్లా నిరుపేద కుటుంబానికి చెందిన అనిల్ బొసక్ తన మూడో ప్రయత్నంలో 45వ ర్యాంక్ సాధించారు. ఆయన ఢిల్లీ ఐఐటీ 2018 బ్యాచ్ విద్యార్థి. అనిల్ తండ్రి వినోద్ సైకిల్‌పై గ్రామాల్లో తిరుగుతూ దుస్తులు అమ్ముతుంటారు. ప్రతిష్టాత్మక యూపీఎస్సీ ఫలితాల్లో అనిల్ జాతీయ స్థాయి ర్యాంకు సాధించడంతో ఆ కుటుంబం పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. తండ్రి వినోద్ కుమారుడి సక్సెస్‌పై స్పందిస్తూ.. ‘ఐఐటీకి అనిల్ ఎంపికైనప్పుడు చాలా సంతోషపడ్డాం. యూపీఎస్సీ ప్రిపరేషన్లో అతని టీచర్ చాలా సాయం చేశారు. కష్టసాధ్యమైన యూపీఎస్సీకి అనిల్ బోసక్ ఎంపిక కావడం కలగా ఉంది. ఐఐటీ తర్వాత అనిల్ ఉద్యోగంలో చేరతాడని అనుకున్నాను. తను.. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం అవుతానని చెప్పాడు. మా అబ్బాయికి ఉపాధ్యాయులు కూడా ఎంతో చేయుతనందించారు. తొలుత కష్టతరమని భావించిన అనిల్ పడుతున్న కష్టం చూసి నా వంతుగా నేను కూడా.. సహాకారం అందించాను. ఇప్పుడు నా కొడుకు విజయంచూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. గతేడాది యూపీఎస్సీ పరీక్షలో 616 ర్యాంకు సాధించిన అనిల్ ఈసారి మరింత కష్టపడి 45వ ర్యాంక్ సాధించి తన కలను సాకారం చేసుకున్నాడని వినోద్ ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల సంఖ్య పెరగాలి -
పిఠాపురం వైద్యుడికి జాతీయ స్థాయి ర్యాంకు
పిఠాపురం టౌన్: స్థానిక కత్తుల గూడానికి చెందిన వైద్యుడు దంగేటి గురుకిరణ్కు సైన్స్ అండ్ రీసెర్చ్ ప్రతిభా పరీక్షలో జాతీయ ర్యాంకు సాధించారు. బెంగళూరు జయదేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కిలర్ సైన్స్ రీసెర్చ్‌కు సంబంధించిన అఖిల భారత పరీక్షలో గురుకిరణ్ 15వ ర్యాంకు సాధించినట్టు ఆయన తల్లిదండ్రులు వీరాస్వామి, వెంకటలక్ష్మి ఆదివారం తెలిపారు. ఎండీ పూర్తి చేసిన గురుకిరణ్ కార్డియోలో ప్రత్యేక నిపుణుడిగా గుర్తింపు పొందేందుకు ఈపరీక్ష రాసినట్టు వారు తెలిపారు. గురుకిరణ్కు పలువురు అభినందనలు తెలిపారు.