‘బిర్యానీ పార్టీ’తో నిరసన | Closure of Meat Shops on August 15 Sparks Political Storm | Sakshi
Sakshi News home page

‘బిర్యానీ పార్టీ’తో నిరసన

Aug 16 2025 6:39 AM | Updated on Aug 16 2025 6:39 AM

Closure of Meat Shops on August 15 Sparks Political Storm

ఛత్రపతి శంభాజీనగర్‌/థానె: ఛత్రపతి శంభాజీ నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జంతు వధ శాలలు, మాంసం దుకాణాల మూసివేతకు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పద మయ్యాయి. ఆగస్ట్‌ 15న స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు గోకులాష్టమి, ఆగస్ట్‌ 20న జైన మతస్తుల ‘పర్యుషన్‌ పర్వ’ల నాడు ఉపవాసాలు, ప్రార్థనలతో రోజంతా గడుపుతారు కాబట్టి మాంసం విక్రయాలపై నగర పరిధిలో నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.

 దీనిని నిరసిస్తూ ఏఐఎంఐఎం నేత, మాజీ ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌ తన నివాసంలో శుక్రవారం బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. చికెన్‌ బిర్యానీతోపాటు, శాకాహార భోజనం కూడా సిద్ధం చేసి ఉంచా. మున్సిపల్‌ కమిషనర్‌ వస్తే శాకాహారం వడ్డించే వాణ్ని. మేం ఏం తినాలో, తినకూడదో ప్రభుత్వం చెప్పడం సరికాదు. ఇలాంటి వాటిని మానేయాలి. మాంసంపై నిషేధం విధించడం దురదృష్టకర ఘటన’అని ఇంతియాజ్‌ జలీల్‌ వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement