breaking news
Indepandanceday
-
‘బిర్యానీ పార్టీ’తో నిరసన
ఛత్రపతి శంభాజీనగర్/థానె: ఛత్రపతి శంభాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జంతు వధ శాలలు, మాంసం దుకాణాల మూసివేతకు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పద మయ్యాయి. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు గోకులాష్టమి, ఆగస్ట్ 20న జైన మతస్తుల ‘పర్యుషన్ పర్వ’ల నాడు ఉపవాసాలు, ప్రార్థనలతో రోజంతా గడుపుతారు కాబట్టి మాంసం విక్రయాలపై నగర పరిధిలో నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీనిని నిరసిస్తూ ఏఐఎంఐఎం నేత, మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ తన నివాసంలో శుక్రవారం బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. చికెన్ బిర్యానీతోపాటు, శాకాహార భోజనం కూడా సిద్ధం చేసి ఉంచా. మున్సిపల్ కమిషనర్ వస్తే శాకాహారం వడ్డించే వాణ్ని. మేం ఏం తినాలో, తినకూడదో ప్రభుత్వం చెప్పడం సరికాదు. ఇలాంటి వాటిని మానేయాలి. మాంసంపై నిషేధం విధించడం దురదృష్టకర ఘటన’అని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు. -
పంద్రాగస్టు వేడుకలకు కలెక్టరేట్ ముస్తాబు
మహబూబ్నగర్ న్యూటౌన్ : పంద్రాగస్టు వేడుకలకు కలెక్టరేట్ ముస్తాబైంది. ప్రధాన ద్వారం నుంచి త్రివర్ణ పతాకాలు, మామిడితోరణాలను కట్టి విద్యుద్దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్ ఆవరణలోని ఆర్డీఓ, డీటీఓ, భీమా ప్రాజెక్టు, వికలాంగులు, వద్ధుల సం„ó మ, సెట్మా, గహనిర్మాణ సంస్థ, డీఆర్డీఏ, సీపీఓ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాలను అందంగా తయారుచేశారు. ఆదివారం ఆయా కార్యాలయాల సిబ్బంది తోరణాలు, త్రివర్ణ పతాకాలను అతికించడంలో నిమగ్నమయ్యారు. సోమవారం పంద్రాగస్టు వేడుకలను కలెక్టరేట్లో అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధం చేశారు.