breaking news
Gokulashtami
-
‘బిర్యానీ పార్టీ’తో నిరసన
ఛత్రపతి శంభాజీనగర్/థానె: ఛత్రపతి శంభాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జంతు వధ శాలలు, మాంసం దుకాణాల మూసివేతకు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పద మయ్యాయి. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు గోకులాష్టమి, ఆగస్ట్ 20న జైన మతస్తుల ‘పర్యుషన్ పర్వ’ల నాడు ఉపవాసాలు, ప్రార్థనలతో రోజంతా గడుపుతారు కాబట్టి మాంసం విక్రయాలపై నగర పరిధిలో నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీనిని నిరసిస్తూ ఏఐఎంఐఎం నేత, మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ తన నివాసంలో శుక్రవారం బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. చికెన్ బిర్యానీతోపాటు, శాకాహార భోజనం కూడా సిద్ధం చేసి ఉంచా. మున్సిపల్ కమిషనర్ వస్తే శాకాహారం వడ్డించే వాణ్ని. మేం ఏం తినాలో, తినకూడదో ప్రభుత్వం చెప్పడం సరికాదు. ఇలాంటి వాటిని మానేయాలి. మాంసంపై నిషేధం విధించడం దురదృష్టకర ఘటన’అని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు. -
కృష్ణం వందే జగద్గురుమ్
చాలామంది కృష్ణుడంటే అల్లరి, చిలిపితనం, మాయలు, మహిమలు... అనే అనుకుంటారు. కానీ కృష్ణుడంటే ఒక చైతన్యం. ఒక స్ఫూర్తి. ఎందుకంటే తానో రాజు కొడుకైనా సామాన్య గోపబాలురతో చెలిమి చేశాడు. అల్లరి పనులతో బాల్యాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పాడు. అంతేకాదు, యవ్వనంలో ఉండే చిన్న చిన్న సరదాలనూ చూపించాడు. బంధాలను నిలుపుకోవడంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, స్నేహం... ఏదైనా సరే పది కాలాల పాటు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలో వివరించాడు. భగవద్గీత ద్వారా ఈ సారాన్ని ప్రపంచానికి అందించాడు. నేడు కృష్ణాష్టమి సందర్భంగా ఆయన చెప్పిన ఆ పాఠాలను అర్థం చేసుకుందాం...స్నేహానికి ప్రాణంచిన్నప్పుడు గోపబాలురతో అరమరికలు లేకుండా హాయిగా ఆడుకున్న శ్రీ కృష్ణుడు స్నేహితులకు, శరణార్థులకూ మాట ఇచ్చాడంటే తప్పడం అన్నది లేదు. ‘కురుక్షేత్రంలో ఆయుధం పట్టను’ అని చెప్పాడు. ఆ మాట మీదే నిలబడ్డాడు. అంతేకాదు. అర్జునుడితో చుట్టరికం ఉన్నప్పటికీ అంతకు మించి ఆప్యాయతను చూపించాడు. శ్రీ కృష్ణుడు, కుచేలుడి గురించి ఎలా చెప్పుకుంటారో అదే విధంగా శ్రీకృష్ణుడు, అర్జునుడి బంధం గురించి కూడా మాట్లాడతారు. పాండవులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అండగా నిలిచాడు. వారికి దిక్కుతోచనప్పుడు మార్గదర్శిగా మారాడు. యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. ఇవన్నీ కేవలం స్నేహం కోసం చేసినవే.ఒక భరోసా... ఒక నమ్మకంనమ్మకం అనేది ఏ బంధంలో అయినా ముఖ్యం. నమ్మకం పోగొట్టుకోడానికి ఎంతోసేపు పట్టదు. కానీ సంపాదించుకోడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. కృష్ణుడు చెప్పింది కూడా ఇదే. ‘నన్ను పూర్తిగా నమ్ము.. అంతా నేను చూసుకుంటాను’ అనే భరోసా ఇచ్చాడందరికీ. అందరికన్నా ముందుగా అర్జునుడికి. ఆ నమ్మకంతోనే యుద్ధంలో పోరాడాడు అర్జునుడు. అంగబలం, అర్థబలం, అధికార బలం, సైనిక బలం ఉన్న కౌరవులపై యుద్ధంలో పాండవులు పైచేయి సాధించగలిగారంటే అందుకు కృష్ణుడే కారణం.స్థాయీ భేదాలు చూపలేదు...అవతలి వాళ్ల స్థాయి ఏంటి... వారు ఎలాంటి హోదాలో ఉన్నారు అన్నది పక్కన పెట్టి అందరినీ సమానంగా చూడాలని బోధించాడు కృష్ణుడు. అందుకే సాయం కోసం వచ్చిన కుచేలుడి మనసు అర్థం చేసుకుని ఆనందాన్ని అందించాడు. అదే సమయంలో గౌరవం చూపించాడు. కేవలం స్నేహితులు అనే కాదు. ప్రేమికులు, భార్యా భర్తలు...ఇలా ఏ బంధంలో అయినా సరే అందరినీ సమానంగా చూస్తే ఎలాంటి చిక్కులూ రావని, పరస్పరం గౌరవించుకుంటే సమస్యలే ఉండవని నిరూపించాడు.క్షమాగుణంతప్పులు అందరూ చేస్తారు. కొన్నిసార్లు తెలియక, కొన్ని సార్లు తెలిసి అవి జరుగుతుంటాయి. అంత మాత్రాన ఆ వ్యక్తి పూర్తిగా చెడ్డవాడు అయిపోడు. వాళ్లపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరమూ లేదు. మిత్రులనే కాదు. శత్రువులను కూడా ఒకే రకంగా ఆదరించడంలో కృష్ణుడు ముందుండే వాడు. ఆ మాత్రం క్షమాగుణం లేకపోతే బంధం ఎలా నిలబడుతుంది? మేనత్తకు ఇచ్చిన మాట కోసం శిశుపాలుడు చేసిన వంద తప్పులను మన్నించాడు. ఎవరినైనా ఇష్టపడితే వాళ్ల నుంచి ఏవేవో ఆశించకుండా పూర్తిగా డిటాచ్డ్గా ఉండాలని బోధించాడు కృష్ణుడు.పరిపూర్ణ జీవితంకృష్ణుడంటే అన్ని బంధాలనూ ఆస్వాదించిన వాడని మరచిపోరాదు. బాల్యంలోనే కన్న తల్లిదండ్రులకు దూరమైనా, పెంచిన తల్లిదండ్రులను పరిపూర్ణంగా ప్రేమించాడు. ఆ తర్వాత కన్న తల్లిదండ్రులకూ సాంత్వన నిచ్చాడు. పదహారు వేలమంది గోపికలకూ తన ప్రేమను పంచాడు. అష్టమహిషులనూ అదేవిధంగా ఆదరించాడు. తనను నమ్మి వచ్చిన ఎవ్వరికీ ఏ లోటూ రానివ్వలేదు. తాను సంతోషంగా ఉన్నాడు. తనతో ఉన్న వారిని అదేరీతిలో ఉంచాడు.వ్యక్తిత్వ వికాస గురువుఇప్పుడు వస్తున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నింటికీ మూలాధారం రణరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతే! వ్యక్తిత్వ వికాస బోధకులకు కృష్ణుడే గాడ్ ఫాదర్. అందుకే కృష్ణుడు పరమాత్ముడే కాదు.. అందరికీ పరమ ఆప్తుడు... జగద్గురువు కూడా!– డి.వి.ఆర్. -
గోకులాష్టమి శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గోకులాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణ పరమాత్ముడు బోధించిన ధర్మ, కర్మ సిద్ధాంతాలు మనమంతా ధర్మమార్గంలో నడిచేలా ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూనే ఉంటాయన్నారు. ప్రజలంతా శాంతిసౌఖ్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం జగన్ మంగళవారం ట్వీట్ చేశారు. Greetings on the auspicious occasion of Gokulashtami. May Lord Krishna's timeless teachings of Dharma & Karma, inspire us to follow the path of virtue & righteousness. Wishing you all good health, peace & prosperity. #KrishnaJanmashtami — YS Jagan Mohan Reddy (@ysjagan) August 11, 2020 గవర్నర్ శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భవద్గీత ద్వారా కృష్ణుడు బోధించిన సందేశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సామరస్యపూర్వక సమాజ స్థాపనకై ఈ పర్వదినం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్ ట్వీట్ చేశారు. On occasion of Sri #krishnajanmashtami I extended my warm greetings & best wishes. This festival reminds us of eternal message of Lord Sri #Krishna through Bhagvad #Gita, affirming the foundation for building a harmonious society. pic.twitter.com/NrDBLQpCnj — Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) August 11, 2020 -
తిరుమల ఆలయంలో గోకులాష్టమి
- ఆరు గంటల్లో శ్రీవారి దర్శనం తిరుమల: తిరుమలలో ఈ నెల 25వ తేదీన గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు బంగారు వాకిలిలో వైదికంగా ఈ ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పకు ఏకాంతంగా తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం 26వ తేదిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప సమయంలో ఆలయ పురవీధుల్లో ఉట్లోత్సవం నిర్వహిస్తారు. 26న నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది. ఉత్సవానికి అవసరమైన ఏర్పాట్లను ఆలయ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఆరు గంటల్లో శ్రీవారి దర్శనం తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తగ్గింది. సాయంత్రం 6 గంటల వరకు 56,879 మంది శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 16 కంపార్ట్మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 6 గంటలు, 4 కంపార్ట్మెంట్లలోని కాలిబాట భక్తులకు 4గంటలు సమయం తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ ఉన్నాయి. హుండీ కానుకలు రూ.3.13 కోట్లు లభించింది.