పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్‌ధామ్‌ యాత్రలో భక్తుల రద్దీ! | Sakshi
Sakshi News home page

Year End 2023: పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్‌ధామ్‌ యాత్రలో భక్తుల రద్దీ!

Published Mon, Dec 25 2023 11:19 AM

char dham yatra breaks record this year - Sakshi

హిందువులు చార్‌ధామ్ యాత్రను ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా చార్‌ధామ్‌ యాత్ర చేయాలనుకుంటారు. ప్రతి సంవత్సరం చార్‌ధామ్‌ యాత్రకు భక్తులు తరలివస్తుంటారు. చార్‌ధామ్‌ యాత్ర అంటే కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలను చుట్టిరావడం. ఈ చార్‌ధామ్‌ యాత్రతో పాటు ఇతర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కూడా 2023లో భక్తుల తాకిడి ఎదురయ్యింది. 2023లో ఏ ధామాన్ని సందర్శించడానికి ఎంత మంది భక్తులు వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.

మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం 50 లక్షల మందికి పైగా భక్తులు చార్‌ధామ్ యాత్రచేశారు. 2021లో సుమారు 5 లక్షల 18 వేల మంది భక్తులు చార్ ధామ్ యాత్ర చేశారు. 2022లో ఈ సంఖ్య 46 లక్షల 27 వేలు దాటింది. 2023లో అక్టోబర్ 16 నాటికి ఈ సంఖ్య 50 లక్షలు దాటడం విశేషం. 

కేదార్‌నాథ్ ధామ్
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి హెలికాప్టర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. 2023 లో 19 లక్షల 61 వేల మందికి పైగా భక్తులు కేదార్‌నాథ్ ధామ్‌కు తీర్థయాత్ర చేశారు. 2023లో కేదార్‌నాథ్ తలుపులు ఏప్రిల్ 25న తెరుచుకున్నాయి. ఈ యాత్ర నవంబర్‌ 15న ముగిసింది.

బద్రీనాథ్ ధామ్
విష్ణు భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించడాన్ని ఒక వరంగా భావిస్తారు. ఈ సంవత్సరం బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్ 27న ప్రారంభమై, నవంబర్ 15న ముగిసింది. ఈ ఏడాది బద్రీనాథ్‌కు వచ్చిన 18 లక్షల 34 వేల మందికి పైగా భక్తులు బద్రీ విశాల్ స్వామిని దర్శించుకున్నారు.

గంగోత్రి 
ఈ ఏడాది 9 లక్షల 5 వేల మందికి పైగా భక్తులు గంగోత్రి యాత్రను పూర్తి చేసుకున్నారు. 2023లో గంగోత్రి యాత్ర ఏప్రిల్ 22 నుండి ప్రారంభమై, నవంబర్ 14న ముగిసింది. ప్రతి సంవత్సరం గంగోత్రి యాత్ర ప్రారంభం కాగానే గంగమ్మ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడికు తరలి వస్తుంటారు.

యమునోత్రి
ఈ ఏడాది యమునోత్రిని 7 లక్షల 35 వేల మందికి పైగా భక్తులు సందర్శించారు. యమునోత్రి యాత్ర 2023,  ఏప్రిల్ 22న న ప్రారంభమై నవంబర్ 15న ముగిసింది. యమునోత్రిని యమునా దేవి నివాసంగా చెబుతారు. ఇక్కడ యమునా దేవి ఆలయం కూడా ఉంది.

అమర్‌నాథ్‌
చార్‌ధామ్‌తో పాటు ఇతర యాత్రా స్థలాల విషయానికి వస్తే 2023లో దాదాపు 4 లక్షల 40 వేల మంది భక్తులు అమర్‌నాథ్‌ను దర్శించుకున్నారు. ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర జూలై  ఒకటి నుండి ప్రారంభమై ఆగస్టు 31న ముగిసింది. అమర్‌నాథ్ ప్రయాణం ఎంతో కష్టతరమైనప్పటికీ భక్తులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో ఇక్కడికి తరలివస్తుంటారు

హేమకుండ్ సాహిబ్ యాత్ర
హేమకుండ్ సాహిబ్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం హేమకుండ్ సాహిబ్ యాత్ర మే 20 నుంచి నుండి అక్టోబర్ 11 వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం హేమకుండ్ సాహిబ్ యాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. 2023లో దాదాపు 2 లక్షల మంది హేమకుండ్ సాహిబ్‌ను సందర్శించుకున్నారు. 
ఇది కూడా చదవండి: అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్  శిల్పం!

Advertisement

తప్పక చదవండి

Advertisement