గ్రామీణ, గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించాలి

Centre releases Covid-19 guidelines for rural areas - Sakshi

30 పడకల కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి

విస్తృతంగా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేపట్టాలి

ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరచాలి 

ప్రామాణిక నియమావళిని విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ  

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నగరాలు, పెద్ద పట్టణాలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను, గిరిజన తండాలను సైతం చుట్టేస్తోంది. చిన్నచిన్న పట్టణాల్లో కూడా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పల్లె ప్రజల అవగాహనారాహిత్యం వైరస్‌ వ్యాప్తికి ఆజ్యం పోస్తోంది. సరైన సమయంలో చికిత్స అందక బాధితులు కన్నుమూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు గ్రామాలు, చిన్న పట్టణాల్లో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం కొత్త మార్గదర్శకాలు, ప్రామాణిక నియమావళిని (ఎస్‌ఓపీ) జారీ చేసింది. గ్రామాలు, పట్టణాల్లో ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో కరోనా బారినపడినప్పటికీ లక్షణాలు లేనివారి కోసం, హోం ఐసోలేషన్‌లో ఉండడం సాధ్యం కాని బాధితుల కోసం 30 పడకల కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అన్ని ప్రజారోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, హెల్త్‌ సెంటర్లు, వెల్‌నెస్‌ సెంటర్లలో సరిపడా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టు (ఆర్‌ఏటీ) కిట్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఈ మార్గదర్శకాల్లో ఇంకా ఏం ప్రస్తావించారంటే...  

► శ్వాస, అనారోగ్య సమస్యలతో బాధపడేవారిపై నిఘా పెట్టాలి.   కరోనా కేసులు గుర్తించి వారికి ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి.  మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించాలి.
► ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించడానికి కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇవ్వాలి. ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లు అందుబాటులో ఉంచాలి.  
► లక్షణాలు లేనప్పటికీ కరోనా సోకిన వారిని క్వారంటైన్‌లో ఉంచాలి. 80 నుంచి 85 శాతం కేసుల్లో లక్షణాలు ఉండట్లేదు. వీరికి ఆసుపత్రి అవసరం లేదు. ఇంట్లో లేదా కరోనా కేర్‌ సెంటర్‌లో ఐసోలేషన్‌ సదుపాయం కల్పించాలి. కుటుంబ సభ్యులూ క్వారంటైన్‌ పాటించాలి.
► కరోనా రోగులకు పారాసిటమాల్, ఐవెర్‌మెక్టిన్, దగ్గు సిరప్, మల్టీ విటమిన్ల్లతో కూడిన హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేయాలి.  
► శ్వాసలో ఇబ్బంది, ఆక్సిజన్‌ సాచురేషన్‌ 94 కన్నా తక్కువ, ఛాతీ భాగంలో నొప్పి, మానసిక ఆందోళన ఉన్న వారికి తక్షణమే వైద్య సదుపాయం అందించాలి.  
► ఆక్సిజన్‌ స్థాయి 94 కన్నా తక్కువ ఉన్న వారికి ఆసుపత్రుల్లో బెడ్ల సదుపాయం కల్పించాలి.  
► తక్కువ, లక్షణాలు లేని వారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు, మోడరేట్‌ కేసుల వారిని డెడికేటెడ్‌ కోవిడ్‌ హెల్త్‌ సెంటర్‌కు, తీవ్రంగా ఉన్న కేసులు డెడికేటెడ్‌ కోవిడ్‌ ఆసుపత్రులకు పంపాలి.  
► కేసుల సంఖ్య, కరోనా తీవ్రత బట్టి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ తప్పకుండా చేయాలి.  
► పట్టణ శివారు ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 30 పడకలుండాలి.

గిరిజన ప్రాంతాల్లో....
గ్రామీణప్రాంతాలతో పోలిస్తే గిరిజన ప్రాంతా ల్లో అదనపు సవాళ్లు ఉండడంతోపాటు ఆరోగ్య సేవలు తక్కువగా, సామాజికంగా, ఆర్థికంగా భౌగోళికంగానూ దూరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో....  
►  ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత గ్రామ సభ తీసుకోవాలి.  కోవిడ్‌–కేర్‌ కార్యక లాపాల్లోనూ  కీలకపాత్ర పోషించాలి.  
► మొబైల్‌ మెడికల్‌ యూనిట్లు ఏర్పాటు చేసి కోవిడ్‌కేర్‌ సెంటర్లతో అనుసంధానించాలి.  
► ఎంఎంయూల్లో వైద్యాధికారి, ఫార్మాసిస్టు, స్టాఫ్‌ నర్సు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉండాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-05-2021
May 17, 2021, 05:37 IST
అమలాపురం టౌన్‌: వారిద్దరూ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కుర్రాళ్లు. కష్టపడి ఉన్నత శిఖరాలను ఆధిరోహించిన యువ కిశోరాలు. ఒకరు...
17-05-2021
May 17, 2021, 04:40 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ మరణాలను ప్రపంచ దేశాలు తక్కువగా చూపిస్తున్నాయంటోంది యూనివర్సిటీ ఆఫ్‌ అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌...
17-05-2021
May 17, 2021, 04:34 IST
లక్ష్మీపురం(గుంటూరు): గుజరాత్‌ జామ్‌నగర్‌లోని రిలయన్స్‌ ప్లాంట్‌ నుంచి ఆక్సిజన్‌ కంటైనర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌ ఆవరణలోని కాంకర్‌...
17-05-2021
May 17, 2021, 04:29 IST
మచిలీపట్నం:  కోవిడ్‌ మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మొబైల్‌ ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా,...
17-05-2021
May 17, 2021, 04:25 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2020 మార్చి నుంచి ఇప్పటి వరకూ కరోనా నియంత్రణ కోసం 2,229 కోట్ల పైచిలుకు వ్యయమైంది....
17-05-2021
May 17, 2021, 04:12 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితులకు కాంగ్రెస్‌ అభయ‘హస్తం’అందించనుంది. అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోగులకు అండగా ఉండాలని...
17-05-2021
May 17, 2021, 04:01 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరికలకు నిర్వహించాల్సిన  ప్రవేశ పరీక్షలు నిర్ణీత తేదీల్లో జరుగుతాయా? లేదా?...
17-05-2021
May 17, 2021, 03:29 IST
సాక్షి, హైదరాబాద్‌: అక్కడ మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే. కరోనా రోగి కదా అన్న కరుణాలేదు.. చేసిందే చికిత్స.....
17-05-2021
May 17, 2021, 03:13 IST
సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు మీదికి బైక్‌పై వచ్చిన ఓ యువకుడిని పోలీసులు ఆపగా ‘మా పక్క వీధిలో అంకుల్‌కు కరోనా...
17-05-2021
May 17, 2021, 02:34 IST
న్యూఢిల్లీ: డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 ఔషధం ‘2– డీజీ’ తొలిబ్యాచ్‌ సోమవారం విడుదల కానుంది. నోటి ద్వారా తీసుకునే...
17-05-2021
May 17, 2021, 02:34 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటివరకు కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలను పంపిణీ...
17-05-2021
May 17, 2021, 01:55 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గందరగోళంలో పడింది. శని, ఆదివారాల్లో టీకాల పంపిణీని నిలిపివేస్తున్నామని.. తిరిగి సోమవారం...
17-05-2021
May 17, 2021, 00:47 IST
ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల ఘోర దుస్థితికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత కాకపోవచ్చు. కానీ ఉన్న...
17-05-2021
May 17, 2021, 00:29 IST
గత నెల 5వ తేదీ మొదలుకొని రోజూ సగటున లక్షకుపైగా కేసులు నమోదవడంతో మొదలై గత పది రోజుల్లో దాదాపు...
16-05-2021
May 16, 2021, 18:27 IST
హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మూసాపేట డివిజన్‌ మోతీనగర్‌ కనకధార గోల్డ్‌ అపార్టుమెంట్‌ అసోసియేషన్‌ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అపార్టుమెంట్‌...
16-05-2021
May 16, 2021, 17:36 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 94,550 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 24,171 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 14,35,491...
16-05-2021
May 16, 2021, 13:16 IST
సాక్షి, సిటీబ్యూరో: మాతృత్వాన్ని ఆస్వాదించే అరుదైన క్షణాల కోసం నిండు గర్భిణులు కంటున్న కలలను కరోనా మహమ్మారి చిదిమేస్తోంది. చివరికి...
16-05-2021
May 16, 2021, 12:45 IST
ఐజ్వాల్‌: కరోనా వైరస్‌ రోజు రోజుకి విజృంభిస్తోంది. పేద, ధనిక తేడాలేకుండా అందరూ ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో పడకలు,...
16-05-2021
May 16, 2021, 10:23 IST
దేశంలో కరోనా వైరస్‌ రెండోదశ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి.
16-05-2021
May 16, 2021, 09:41 IST
ఆక్సిజన్‌ అందక ఏ ఒక్కరి ప్రాణం పోకుండా ఉండేందుకు నడుం బిగించారు సోషల్‌ డేటా ఇన్‌షేటివ్స్‌ ఫోరం (ఎస్‌డీఐఎఫ్‌), యాక్సెస్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top