కరోనా కాలర్‌ ట్యూన్లు తక్షణమే ఆపేయండి

Centre may drop Covid pre-call announcements from phones - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అందుబా టులోకి తెచ్చిన కాలర్‌ ట్యూన్లను ఇకపై నిలిపివేయాలని టెలికం కంపెనీలను కేంద్రం ఆదేశించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు, వ్యాధిపై ముందు జాగ్రత్తలు, టీకా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ రెండేళ్లుగా పలు దఫాలుగా వీటిని జారీ చేసింది. ఇకపై కరోనా సంబంధిత అన్ని ప్రకటనలు, కాలర్‌ ట్యూన్లను తక్షణమే ఆపేయాలని టెలికం ప్రొవైడర్లను కోరుతూ టెలికమ్యూనికేషన్ల శాఖ మార్చి 29వ తేదీన ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ఇందుకు, కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ కూడా సమ్మతించిం దని వివరించింది.  వీటి కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్‌ కాల్స్‌ ఆలస్యమవు తున్నాయంటూ కేంద్రానికి ఇటీవలి కాలంలో పలువురి నుంచి విజ్ఞాపనలు అందాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top