సోషల్‌ మీడియాను ముంచెత్తిన బడ్జెట్‌ మీమ్స్‌ 

Budget 2023 Memes: Social Media Flooded With Funny Reactions - Sakshi

2023–24 బడ్జెట్‌పై సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు పోస్టు చేసిన మీమ్స్‌ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి. ముఖ్యంగా మిడిల్‌ క్లాస్, వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి, సిగరెట్లపై వా రు చేసిన మీమ్స్‌ ట్విట్టర్‌లో టాప్‌ ట్రెండింగ్‌గా ని లిచాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ న్‌ బడ్జెట్‌ ప్రసంగం మొదలుపెట్టే ముందే మొదలైన మీమ్స్‌ హడావుడి... మధ్యతరగతికి ఆదాయపరిమితి పెంపు ప్రతిపాదనతో పతాక స్థాయికి చేరాయి.

అలాగే సిగరెట్లపై 16% పన్ను పెంపు ప్రతిపాదనతో నిరాశ చెందిన పొగరాయుళ్లు పెట్టి న మీమ్స్‌ కూడా ట్రెండ్‌ అయ్యాయి. అయితే ఐటీ పరిమితి పెంపు కొత్త పన్ను విధానానికి వర్తిస్తుందని నిర్మల ప్రకటించడంపై చాలా మంది నెటిజన్లను అయోమయానికి గురిచేసింది. ఈ పన్ను విధానంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తూ మీమ్స్‌ పెట్టగా మరికొందరు మాత్రం తమకు ఏమీ అర్థం కాలేదన్న సంకేతాన్ని మీమ్స్‌ రూపంలో పోస్టు చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top