బడ్జెట్‌ 2021: ఇక 20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కే

Budget 2021 To Reduce Vehicle Pollution Center Announces New Scrap Vehicle Policy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దానిలో భాగాంగా ఈ సారి బడ్జెట్లో నూతన పాలసీని ప్రకటించారు. వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్న ఆర్థిక మంత్రి.. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వెల్లడించారు.

ఇక దీనిలో భాగంగా కాలం తీరిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని తర్వలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాల లైఫ్‌టైమ్‌ని 15 ఏళ్లుగా నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వాయు కాలుష్యం నివారణకు రూ.2,217కోట్లు కేటాయించారు.
(చదవండి: ఇక 15 ఏళ్ల ప్రభుత్వ వాహనాలు తుక్కుతుక్కే!)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top